కేంద్ర నిధుల కోసమే పంచాయతీ ఎన్నికలు
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
బోయినపల్లి(చొప్పదండి): కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఇస్తున్న నిధుల కోసమే గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శనివారం మండలకేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇంట్లో పొయ్యి వెలిగించే ఉజ్వల గ్యాస్ కనెక్షన్, తినే రేషన్ బియ్యం నుంచి ఉపాధిహామీ పని, బయటకు వెళితే రోడ్లు, వీధి లైట్లకు కేంద్రమే నిధులు ఇస్తుందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఆర్‌ఐఎఫ్, పీఎంజీఎస్‌వై నిధులతో రోడ్ల సౌకర్యం కల్పిస్తున్నారని, మోదీ గిఫ్ట్ కింద సైకిళ్లు, పదోతరగతి విద్యార్థుల ఫీజులు చెల్లించారని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మాటలు నమ్మకుండా ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు ఎడపల్లి పరశురాం, మండల ఇన్‌చార్జి దుబాల శ్రీనివాస్, నాయకులు ఉదారి నరసింహచారి, గుడి రవీందర్‌రెడ్డి, క్యాతం తిరుపతిరెడ్డి, సూదుల సాయికుమార్, బొంగోని అశోక్, స్వామికుమార్, శ్రీనివాస్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్, సుంకపాక ప్రభు, సారంపల్లి రాజు, గంగయ్య, రమేశ్, ధర్మేంద్ర, వినోద్, అనిల్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.


