తొలిఫలితాలు తేలేది ఇక్కడే!
సిరిసిల్ల జిల్లాలో..
జగిత్యాలలో..
పెద్దపల్లిలో..
పదుల సంఖ్యలో 500 లోపు ఓట్లున్న గ్రామాలు
ఇలాంటి గ్రామాలు సిరిసిల్లలోనే అధికం
గంటలోగా ఈ గ్రామాల్లో వెలువడే అవకాశాలు
హామ్లెట్లకు గ్రామాల హోదా రావడమే కారణం
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
పంచాయతీ ఎన్నికలకు తొలివిడత నామినేషన్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతి తక్కువ ఓట్లున్న గ్రామాలపై అందరి దృష్టి పడుతోంది. నవంబరు 27 నుంచి మొదలై.. డిసెంబరు 17 వరకు మూడు దశల్లో జరిగే ఈ ఎన్నికలకు కరీంనగర్ 316 గ్రామాలు, పెద్దపల్లి 263 గ్రామాలు, జగిత్యాల 385 గ్రామాలు, సిరిసిల్ల 260 కలిపి మొత్తం గ్రామాలు 1,224 గ్రామాలకు ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా గ్రామ జనాభా కనీసం 1000 ఓట్లకు కాస్త అటూఇటూగా ఉంటుంది. కానీ.. నూతన రాష్ట్రంలో పలు హామ్లెట్లు, తండాలకు జీపీ హోదా లభించింది. ఈ నేపథ్యంలో 500 ఓట్లలోపు ఉన్న జీపీలు సర్వసాధారణ విషయంగా మారాయి. అదే సమయంలో అంతకుమించి తక్కువ ఓట్లున్న గ్రామపంచాయతీలు కూడా ఉన్నాయి. ఇలాంటి గ్రామపంచాయతీల్లో ఫలితాలు వేగంగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. మరీ 200, 300లోపు ఓట్లున్న గ్రామాల్లో గంటలోపే ఫలితం తేలనున్నాయి. ఇలాంటి తక్కువ ఓట్లున్న గ్రామ పంచాయతీలు సిరిసిల్లలో ఎక్కువగా ఉన్నాయి. ఇందులో మరీ ముఖ్యంగా ఎల్లారెడిపేట మండలం గుంటచెరువుపల్లి తండాలో కేవలం 121 ఓట్లు ఉండగా, ఇల్లంతకుంట మండలం చిక్కుడువానిపల్లెలో 150 ఓట్లు.. చందుర్తి మండలం కొత్తపేటలో 163 ఓట్లు ఉండటం గమనార్హం.
కరీంనగర్ జిల్లాలో 500 ఓటర్ల కంటే తక్కువగా ఉన్న గ్రామాలు (28)
కరీంనగర్ నియోజకవర్గంలో (2), కరీంనగర్ రూరల్ మండలం తాహెర్‌కొండాపూర్ (436), నల్లగుంటపల్లి (431). హుజూరాబాద్ నియోజకవర్గంలో (9), హుజూరాబాద్ మండలం బొత్తలపల్లి (448), సైదాపూర్ మండలం గర్రెపల్లి (382), రాయికల్ తండా (470), గుండ్లపల్లి (420), జమ్మికుంట మండలం పాపయ్యపల్లి (492), నాగారం (457), వీణవంక మండలం నర్సింహాలపల్లి (498), రామకృష్ణాపూర్ (404), ఇల్లంతకుంట మండలం వాగొడ్డు రామన్నపల్లి (486). చొప్పదండి నియోజకవర్గంలో(2), చొప్పదండి మండలం కోనేరుపల్లి (347), గంగాధర మండలం ఇస్లాంపూ ర్ (484). మానకొండూర్ నియోజకవర్గంలో (15 గ్రామాలు) మానకొండూర్ మండలం పెద్దూర్‌పల్లి (282), రాఘవపూర్ (342), బంజేరుపల్లి (310), గన్నేరువరం మండలం చాకలివానిపల్లి (436), చొక్కరావుపల్లె (460), గోపాల్పూర్ (394), పీచుపల్లి (285), సాంబయ్యపల్లి (215), యస్వాడ (230), శంకరపట్నం మండలం అంబేద్కర్‌నగర్ (386), అర్కండ్ల (452), గుడాటిపల్లి (375), కల్వ ల (345), మక్త (264), నల్లవంకాయపల్లి (246).
తంగళ్లపల్లి మండలంలో మొత్తం ఏడు గ్రామాల్లో 500 లోపు ఓట్లున్నాయి. అందులో చింతల్‌ఠాణాలో అత్యల్పంగా 209 ఓట్లే ఉన్నాయి. ముస్తాబాద్ మండలంలో మొత్తం ఐదు గ్రామాల్లో గోపాల్‌పల్లిలో 262 అత్యల్ప ఓట్లు కలిగి ఉంది. వీర్నపల్లి మండలంలో 5 గ్రామాలుండగా.. మద్దిమల్ల (306 ఓట్లు) ఆఖరుగా నిలిచింది. గంభీరావుపేటలో ఐదు గ్రామాలకు లక్ష్మీపూర్ (265 ఓట్లు) చివరన నిలిచింది. ఎల్లారెడ్డిపేటలో 9 గ్రామాలు ఉండగా అందులో గుంటచెరువుపల్లి తండా (121) ఓట్లు కలిగి ఉంది. ఇల్లంతకుంట మండలంలో మొత్తం నాలుగు గ్రామాలకు చిక్కుడువానిపల్లిలో (150) ఓట్లు నమోదయ్యాయి. వేములవాడ నియోజకవర్గంలో వేములవాడ అర్బన్‌లో 500 ఓట్లున్న ఏకై క గ్రామం గుర్రంవానిపల్లి (293 ఓట్లు). వేములవాడ రూరల్‌లో మూడు గ్రామాలలో వెంకటంపల్లి (308) ఓట్లతో చివరన ఉంది. రుద్రంగిలో ఆరు గ్రామాల్లో వీరునితండా (278)ఓట్లతో ఆఖరు స్థానంలో నిలిచింది. కోనరావుపేటలో మొత్తం ఆరు గ్రామాలకు గొల్లపల్లి కొలనూరు 227 అతి తక్కువ ఓట్లు నమోదు చేసింది. చందుర్తిలోలో రెండు గ్రామాలకు కొత్తపేటలో అత్యల్పంగా 163 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. బోయినపల్లి మండలంలో 500లోపు ఓట్లున్న గ్రామాలేవీ లేవు.
జగిత్యాల నియోజకవర్గంలో (5గ్రామాలు), రాయికల్ మండలం ధావన్‌పెళ్లి (436), కురుమపెళ్లి (323), కైరిగూడెం (170), రామారావుపల్లె (390), వస్తాపూర్ (442), సారంగాపూర్.. బీర్పూర్ మండలం (నాలుగు గ్రామాలు), ఇందిరానగర్ (310), బొందుగూడెం (235), చిన్నకొలువై(110), కోమన్‌పల్లి(350). కోరుట్ల నియోజకవర్గంలో (9గ్రామాలు), మల్లాపూర్ మండలం హుస్సేన్‌నగర్ (357), ఓబులాపూర్‌తండా (311), వాల్గొండతండా (326), మెట్‌పల్లి మండలం ఏఎస్‌ఆర్ తండా (297), చెర్లకొండాపూర్ (484), కేసీఆర్ తండా (333), పాటిమీది తండా (311), రామారావుపల్లె (359), రంగారావుపేట (424). ధర్మపురి నియోజకవర్గంలో (4 గ్రామాలు), గొల్లపల్లి మండలం గంగాదేవిపల్లి (441), నందిపల్లి (365), వెల్గటూర్ మండలం కోటిలింగాల (436), బుగ్గరాం మండలం సందయ్యాపల్లి (250).
మంథని మండలంలో బెస్తపల్లిలో 472, భట్టుపల్లిలో 476, గుమ్నూర్‌లో 490, తోటగోపయ్యపల్లిలో 490 ఓటర్లు మాత్రమే ఉన్నారు. అలాగే రామగిరి మండలంలోని లొంకకేసారం గ్రామంలో 486, పెద్దంపేట గ్రామంలో 482, కమాన్‌పూర్‌లోని గొల్లపల్లెలో 507, ముత్తారంలోని దర్యాపూర్‌లో 360 ఓటర్లు ఉన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఓదెల మండలంలోని అబ్బీడిపల్లిలో 450, లంబాడి తండాలో 421, కాల్వశ్రీరాంపూర్‌లోని మడిపల్లిలో 439, ఇప్పలపల్లిలో 477, లక్ష్మీపురంలో 496 ఓట్లు, ధర్మారం మండలంలోని లంబాడితండలో 445, నాయకంపల్లిలో 454, ఎలిగేడులోని లోకపేట గ్రామంలో 527 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు.
తొలిఫలితాలు తేలేది ఇక్కడే!


