ఖాళీ బిందెలతో నిరసన | - | Sakshi
Sakshi News home page

ఖాళీ బిందెలతో నిరసన

Nov 29 2025 7:57 AM | Updated on Nov 29 2025 7:59 AM

● సీఐ శ్రీనివాస్‌గౌడ్‌

సిరిసిల్ల అర్బన్‌: పెద్దూరు డబుల్‌ బెడ్‌రూమ్‌ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ కాలనీవాసులు శుక్రవారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. వీరికి బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ వారం రోజులుగా నీటి సమస్యతో కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే వారు లేరన్నారు. మిషన్‌ భగీరథ నీరు కాలనీకి రావడం లేదన్నారు. కాలనీలోని బోరుమోటార్ల ద్వారా వస్తున్న నీరు గ్రౌండ్‌ఫ్లోర్‌కు మాత్రమే సరిపోతుందని, మిగతా వారు ఇబ్బంది పడుతున్నారన్నారు.

ఆటోడ్రైవర్లు బీమా చేయించుకోవాలి

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆటోడ్రైవర్లు డ్రైవింగ్‌ లైసెన్స్‌, హెల్మెట్‌, బీమా కలిగి ఉండాలని సీఐ శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు. మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్‌ నాగుల తిరుపతి గతేడాది జూన్‌లో రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా.. వారి కుటుంబానికి బీమా రూ.లక్ష చెక్కును శుక్రవారం అందజేశారు. గతేడాది ఎస్పీ మహేశ్‌ బీ గీతే ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్‌ ఇచ్చి బీమా చేయించారు. తిరుపతి మృతిచెందడంతో మంజూరైన బీమా చెక్కును వారి కుటుంబానికి అందజేశారు. ఎస్సై రాహుల్‌రెడ్డి ఉన్నారు.

రేపు డీసీసీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం

సిరిసిల్లటౌన్‌: జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగీ తం శ్రీనివాస్‌ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌ తెలిపారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ముందుగా పట్టణంలో ర్యాలీ తీస్తామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ అజ్మతులా్‌ల్‌ హుస్సేని, సిరిసిల్ల ఇన్‌చార్జి కె.కె.మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం హాజరవుతారని తెలిపారు.

దీక్షాదివస్‌ను విజయవంతం చేయండి

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లా కేంద్రంలో నిర్వహించే దీక్షాదివస్‌ను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కోరారు. మండల కేంద్రంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చేపట్టిన ఆమరణ నిరసన దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్‌ ఆమరణ దీక్షను గుర్తిస్తూ ఏటా దీక్షా దివస్‌ నిర్వహిస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, పీఏసీఎస్‌ చైర్మన్‌ గుండారపు కృష్ణారెడ్డి, నాయకులు అందె సుభాష్‌, గుల్లపల్లి నర్సింహారెడ్డి, కొండ రమేశ్‌గౌడ్‌, ఎడ్ల సందీప్‌, ఎనగందుల నర్సింలు, చాంద్‌పాషా, ప్రభు, పాశం దేవరెడ్డి, హసన్‌, రాము, సురేశ్‌, సుధాకర్‌రావు, అజ్జు, జీడి శ్రీనివాస్‌, బాద రమేశ్‌, నాగరాజు, బాల్‌రెడ్డి ఉన్నారు.

ఇసుక ట్రాక్టర్ల బాధలు తప్పించాలి

సిరిసిల్లటౌన్‌: ఇసుక ట్రాక్టర్ల ద్వారా పడుతున్న ఇబ్బందులను తప్పించాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని సాయినగర్‌వాసులు శుక్రవారం నిరసన తెలిపారు. ఈమేరకు ఇసుక ట్రాక్టర్లు రవాణా చేసే రోడ్డుపై బైఠాయించి మాట్లాడారు. అధికలోడ్‌, ఓవర్‌ స్పీడ్‌తో తమకు ప్రాణహాని ఉందని భయాందోళన వ్యక్తం చేశారు. గతంలో ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. నిబంధనలు పాటించని ఇసుక ట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పట్టణ పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన విరమించారు.

ఖాళీ బిందెలతో నిరసన
1
1/3

ఖాళీ బిందెలతో నిరసన

ఖాళీ బిందెలతో నిరసన
2
2/3

ఖాళీ బిందెలతో నిరసన

ఖాళీ బిందెలతో నిరసన
3
3/3

ఖాళీ బిందెలతో నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement