పాఠ్యాంశాలపై ప్రయోగాలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పాఠ్యాంశాలపై ప్రయోగాలు చేయాలి

Nov 29 2025 7:57 AM | Updated on Nov 29 2025 7:57 AM

పాఠ్యాంశాలపై ప్రయోగాలు చేయాలి

పాఠ్యాంశాలపై ప్రయోగాలు చేయాలి

● ప్లాస్టిక్‌ వినియోగించొద్దు ● ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

● ప్లాస్టిక్‌ వినియోగించొద్దు ● ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల: విద్యార్థులు పాఠ్యాంశాలపై ప్రయోగాలు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ సూ చించారు. వికసిత్‌, ఆత్మ నిర్భర్‌ భారత్‌లో భాగంగా జిల్లా కేంద్రంలోని గీతానగర్‌ హైస్కూల్‌లో శుక్రవారం జిల్లాస్థాయి ఇన్‌స్పైర్‌, విద్య, వైజ్ఞానిక ప్రదర్శన, రాజ్య స్థరీయ బాల్‌ వైజ్ఞానిక ప్రదర్శన (ఆర్‌ఎస్‌బీవీపీ) నిర్వహించారు. విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్లను పరిశీలించి.. ఎలా తయారు చేశారు అని తెలుసుకున్నారు. ఇన్‌చార్జి కలెక్టర్‌ మా ట్లాడుతూ సీవీ రామన్‌, అబ్దుల్‌ కలాం స్ఫూర్తితో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. సౌర విద్యుత్‌, పవన విద్యుత్‌, ధర్మో డైనమిక్స్‌, కిరణ జన్య సంయోగక్రియపై విద్యార్థులకు ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టారు. సైన్స్‌ మ్యూజియం స్థలం కోసం ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. డీఈవో వినోద్‌కుమార్‌, జిల్లా సైన్స్‌ అధికారి పాముల దేవయ్య తదితరులు పాల్గొన్నారు.

ఖర్చు పక్కాగా నమోదు చేయాలి

సిరిసిల్ల: ఎన్నికల్లో అభ్యర్థులు చేసే ఖర్చును పక్కాగా నమోదు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సహాయ వ్యయ పరిశీలకుల(ఏఈవో)కు శిక్షణ ఇచ్చారు. ఇన్‌చార్జి కలెక్టర్‌ మాట్లాడుతూ అభ్యర్థులు ఖర్చు రిజిస్టర్లు నిర్వహించాలని సూచించారు. ఎన్నికల వ్యయం కోసం ప్రత్యేక బ్యాంక్‌ ఖాతా తెరవాలని తెలిపారు. రూ.50వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లవద్దని సూచించారు. వ్యయ పరిశీలకులు రాజ్‌కుమార్‌, నోడల్‌ అధికారి శేషాద్రి, డీపీవో షరీఫొద్దీన్‌ పాల్గొన్నారు.

మొదటి ర్యాండమైజేషన్‌ పూర్తి

పోలింగ్‌ సిబ్బందికి మొదటి ర్యాండమైజేషన్‌ పూర్తి చేసినట్లు ఇన్‌చార్జి కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్‌ తెలిపారు. నోడల్‌ అధికారులు డీ ఆర్డీవో శేషాద్రి, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్‌, జెడ్పీ డిప్యూటీ సీఈవో గీత, డీపీవో షరీఫొద్దీన్‌, ఏవో రాంరెడ్డి, ఈడీఎం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement