వేములవాడరూరల్: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలు ఆర్వో కేంద్రాలు, ఎస్‌ఎస్‌టీ చెక్‌పోస్ట్‌ను జిల్లా సాధారణ పరిశీలకులు రవికుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. వేములవాడరూరల్ మండలం చెక్కపల్లి, వట్టిమల్ల ఆర్వో కేంద్రాలు, ఫాజుల్‌నగర్ ఎస్‌ఎస్‌టీ చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేశారు.
గర్భస్థ లింగ నిర్ధారణ నేరం
సిరిసిల్లటౌన్: గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు నేరమని జిల్లా వైద్యాధికారి రజిత హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో శుక్రవారం జిల్లా పీసీపీఎన్డీటీ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో మా ట్లాడారు. జిల్లాలో 27 స్కానింగ్ కేంద్రాలు రిజిస్ట్రేష న్ అయ్యాయని తెలిపారు. గర్భస్థ లింగ నిర్ధారణ నే రమని, ఉల్లంఘనకు పాల్పడితే మూడేళ్ల జైలుశిక్షతోపాటు రూ.10వేలు జరిమానా విధిస్తారని హెచ్చరించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రి స్కానింగ్ కేంద్రాలలో ఫారం–ఎఫ్ తప్పనిసరిగా నింపి, వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి ప్రతీ నెల 5న పంపించాలని ఆదేశించారు. వైద్యులు అనిత, ప్రోగ్రాం ఆఫీసర్లు, ఎన్జీవో ప్రెసిడెంట్ చింతోజు భాస్కర్, అరవింద్ పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
గంభీరావుపేట(సిరిసిల్ల): జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు–2025లో భాగంగా మండలంలోని కొత్తపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన వి ద్యార్థులు అక్షయ, భువనశ్రీ, తేజశ్వి జిల్లాస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. వచ్చేనెల 3న కరీంనగర్‌లో జరిగే రాష్ట్రస్థాయి చెకుముకి పోటీల్లో పాల్గొంటారు.
ఆర్వో కేంద్రాల తనిఖీ


