చెక్‌పోస్ట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ మహేశ్ బీ గీతే ● సరిహద్దు చెక్‌పోస్టులు తనిఖీ
వేములవాడరూరల్/తంగళ్లపల్లి: చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. వేములవాడరూరల్ మండలం ఫాజుల్‌నగర్, తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద సరిహద్దు చెక్‌పోస్టులను శుక్రవారం తనిఖీ చేసి మాట్లాడారు. రాత్రి సమయంలో ఇతర జిల్లాల నుంచి వచ్చే వాహనాల తనిఖీ సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపా రు. వేములవాడరూరల్ మండలం వట్టెంల, నూకలమర్రిలోని నామినేషన్ కేంద్రాలు పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధి నిబంధన అమలులో ఉంటుందన్నారు. సీఐలు శ్రీనివాస్, మొగిలి, ఎస్సై చల్లా వెంకట్రాజం, పీఆర్ ఏఈ మహేశ్, చెక్ పోస్ట్ సిబ్బంది ఉన్నారు.


