● 2019లో గ్రామపంచాయతీ ● తొలి పాలకవర్గం ఏకగ్రీవం ● నేడు
చిక్కుడువానిపల్లి ఏకగ్రీవం?
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని చిక్కుడువానిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్‌తోపాటు వార్డుసభ్యులను ఏకగ్రీవం చేసినట్లు తెలిసింది. ఈనెల 30 నుంచి నామినేషన్లు ప్రారంభం కానుండగా.. గ్రామస్తులు ముందస్తుగానే ఏకగ్రీవం కోసం చర్చించుకున్నట్లు తెలిసింది. 2019లో చిక్కుడువానిపల్లి ఏర్పడగా తొలి ఎన్నికల్లో సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదే ఆనవాయితీని కొనసాగించేందుకు ఇప్పుడు కూడా ఏకగ్రీవం చేసుకున్నట్లు సమాచారం. గ్రామంలో 45 నివాసాలు.. 250 మంది వరకు జనాభా.. 150 మంది ఓటర్లు ఉంటారు. గ్రామంలో నాలుగు వార్డులు ఉన్నాయి. సర్పంచ్ అభ్యర్థి జనరల్‌గా రిజర్వు అయింది. గత ఎన్నికల్లో ఏకగ్రీవమైనప్పటికీ ప్రోత్సాహక నజరానా రూ.10లక్షలు రాలేదని గ్రామస్తులు వాపోతున్నారు. తన నియోజకవర్గంలో ఏకగ్రీవమైన గ్రామాలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.20 లక్షల వరకు కేటాయిస్తానని ఈ ప్రాంత ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇటీవల ప్రకటించారు.
హోరాహోరీగా వాలీబాల్ పోటీలు
ధర్మారం(ధర్మపురి): ధర్మారం మండలం నందిమేడారం బాలుర గురుకుల విద్యాలయంలో జరుగుతున్న 69వ ఎస్‌జీఎఫ్ అండర్– 14 రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో గురువారం బాలబాలికలు హోరాహోరీగా తలపడ్డారు. రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి 244 మంది క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. కాగా ఈనెల 28 వరకు జరిగే పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సురేశ్, ఎంఈవో ప్రభాకర్, ప్రిన్సిపాల్ విద్యాసాగర్, వాలీబాల్ సంఘం అధ్యక్షుడు ముత్యాల రవీందర్, కార్యదర్శి తమ్మడవేని రాజయ్య, ఎస్‌జీఎఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి లక్ష్మణ్, క్రీడల పరిశీలకులు బాలు, మల్లేశ్, వ్యాయామ ఉపాధ్యాయులు కొమురయ్య, కుమార్, సౌజన్య, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.


