మద్యం పట్టివేత
చందుర్తి(వేములవాడ): మండలంలోని జోగాపూర్, కిష్టంపేటల్లో అక్రమ మద్యం నిలువ ఉందన్న పక్కా సమాచారంతో చందుర్తి పోలీసులు గురువారం రాత్రి దాడులు చేశారు. సుమారు రూ.12,395 విలువ గల అక్రమ మధ్యాన్ని పట్టుకున్నట్లు చందుర్తి ఏఎస్సై ఆనంద్ తెలిపారు. ఏఎస్సై ఆనంద్ తెలిపిన వివరాలు. మండలంలోని జోగాపూర్‌కు చెందిన గడ్డం అంజయ్య ఇంట్లో రూ.6,725 విలువ గల మద్యం, కిష్టంపేటలో వాంకే అనిత ఇంట్లో రూ.5,670 విలువ గల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కరీంనగర్‌క్రైం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు త్రీటౌన్ పోలీసులు తెలిపారు. కరీంనగర్ హుస్సేనిపురకు చెందిన మహ్మద్ అమీర్‌ఖాన్ (18) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. బుధవారం రాత్రి షాపు మూసివేసి కార్ఖానాగడ్డకు రాగా, వెనకనుండి గుర్తు తెలియని వ్యక్తి వ్యాన్‌తో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరు..
మోర్తాడ్: మోర్తాడ్ మండలం గాండ్లపేట శివారు పెద్దవాగుపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్‌కు చెందిన పేర్ల కృష్ణ (44) తన స్నేహితుడు కోట సమ్మయ్యతో కలిసి ఆర్మూర్‌కు వెళుతుండగా వంతెనపై ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన కృష్ణను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు.


