భర్త వేధింపులు భరించలేక..
● భర్తను కత్తితో నరికి చంపిన భార్య
● మల్లాపూర్‌లో దారుణం
మల్లాపూర్: భర్త వేధింపులు భరించలేక కత్తితో నరికి చంపిన ఘటన మండలకేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మండలకేంద్రానికి చెందిన పల్లికొండ మల్లయ్య, రాజు దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. అందరికీ పెళ్లి అయ్యింది. కొంతకాలంగా భార్యతో మల్లయ్య గొడవ పడుతున్నాడు. నిత్యం దుర్భాషలాడుతున్నాడు. వ్యవసాయం చేసే విషయమై మంగళవారం రాత్రి వాగ్వాదానికి దిగారు. బుధవారం ఉందయం కుమారుడు, కోడలు వ్యవసాయ పనులకు వెళ్లిపోయారు. అప్పటికే బయటకు వెళ్లి వచ్చిన మల్లయ్య.. భార్యతో గొడవపెట్టుకున్నాడు. అతడి వేధింపులు తట్టుకోలేక మల్లయ్య మెడపై కత్తితో నరికింది. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం పోలీసులకు లొంగిపోయింది. సీఐ అనిల్, ఎస్సై రాజు సిబ్బందితో వచ్చి విచారణ చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామానికి చెందిన ప్రముఖ సినీ దర్శకుడు సంపత్ నంది తండ్రి నంది కిష్టయ్య(75) మంగళవారం రాత్రి మృతిచెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం ఓదెల గ్రామ శివారులో కిష్టయ్య అంత్యక్రియలు జరిగాయి. హైదరాబాద్‌కు చెందిన సినీపరిశ్రమలోని ప్రముఖులు, అభిమానులు, గ్రామస్తులు హాజరయ్యారు. ఆయనకు కుమారులు సంపత్ నంది, రమేశ్ ఉన్నారు. సదాశయఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్, ప్రధానకార్యదర్శి లింగమూర్తి, కార్యదర్శి మేరు గు జ్ఞానేంద్రచారి సూచనతో కిష్టయ్య కళ్లను కుటుంబసభ్యులు దానం చేశారు.
బోయినపల్లి(వేములవాడ): బోయినపల్లి మండలం కొదురుపాకకు చెందిన వృద్ధుడు అంజయ్య(65) బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు. అంజయ్య వండ్రంగి పనులు చేస్తూ జీవనోపాధి పొందేవాడు. కొదురుపాక పా త గ్రామంలో ముంపునకు గురైన ఓ పాత ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతునికి భార్య పద్మ, కూతురు మమత ఉన్నారు. అంజయ్య ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు.
వృద్ధురాలి
బోయినపల్లి(చొప్పదండి): రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లికి చెందిన నల్లాల లక్ష్మీనర్సవ్వ(70) బుధవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. లక్ష్మీనర్సవ్వ గతంలో కోతులు బెదిరించడంతో కిందపడి చేయి విరిగింది. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. మధ్యాహ్నం ఇంట్లోంచి బయటకు వెళ్లిన వృద్ధురాలు వెంకట్రావుపల్లి, నర్సింగాపూర్ పరిసరాల్లోని ఓ వ్యవసాయబావిలో దూకింది. సాయంత్రం మృతదేహం కనిపించింది. మృతురాలుకు భర్త భూమయ్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎస్సై ఎన్.రమాకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భర్త వేధింపులు భరించలేక..
భర్త వేధింపులు భరించలేక..


