కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్
● 1800 233 1495లో ఫిర్యాదు చేయండి : ఇన్‌చార్జి కలెక్టర్
సిరిసిల్ల: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్‌లో బుధవారం కంట్రోల్ రూమ్, హెల్ప్‌లైన్ సెంటర్, మీడియా సెంటర్‌ను ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌తో కలిసి ప్రారంభించి పరిశీలించారు. ఓటర్లను ప్రలోభపెడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చినా మీడియాలో ఫేక్‌న్యూస్ ప్రసారమైన, ఓటర్లు ఏదైనా సందేహాల నివృత్తికి, సమాచారం కోసం సంప్రదించిన వెంటనే స్పందించాలని చెప్పారు. ఎన్నికల ఫిర్యాదులను 1800 233 1495లో చెప్పాలని కోరారు. డీఆర్డీవో శేషాద్రి, జెడ్పీ డిప్యూటీ సీఈవో గీత, డీపీవో షరీఫోద్దీన్, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


