కూలుతున్నాయ్‌..! | - | Sakshi
Sakshi News home page

కూలుతున్నాయ్‌..!

Nov 27 2025 5:48 AM | Updated on Nov 27 2025 5:54 AM

● నాడు మూలవాగుపై బ్రిడ్జి ● నేడు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల బేస్‌మెంట్‌ ● నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు ● ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు

● నాడు మూలవాగుపై బ్రిడ్జి ● నేడు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల బేస్‌మెంట్‌ ● నాణ్యతా ప్రమాణాలపై అనుమానాలు ● ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు

ఇదీ వేములవాడ మూలవాగుపైన నిర్మిస్తున్న రెండో బ్రిడ్జి. గతంలో వచ్చిన వరదకు కొట్టుకుపోయింది. 2016లో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు రూ.28కోట్లతో రెండు వంతెనల పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో రూ.13కోట్లు బ్రిడ్జి కోసం, మిగతావి భూసేకరణకు కేటాయించారు. మొదటి బ్రిడ్జి పూర్తికాగా.. రెండో వంతెన పనులు కొనసాగుతున్నాయి. ఈక్రమంలోనే వర్షాలు కురిసి వరద రావడంతో రెండో వంతెన కూలిపోయింది. రెండు బ్రిడ్జీలకు రూ.13 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా.. అప్పటి వరకు జరిగిన పనులకు రూ.3.50కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని సాయి కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ కాంట్రాక్టర్‌ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి పనులు నిలిపివేశారు. ఆ తర్వాత కాంట్రాక్టర్లు మారడం, రీషెడ్యూల్‌ కావడం, అంతలోనే ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయి. ప్రస్తుతం ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ చొరవతో పనులు మొదలయ్యాయి.

వేములవాడ: వసతుల కల్పనే లక్ష్యంగా చేపడుతు న్న పనులు పూర్తికావడం లేదు. పూర్తికాకముందే కూలిపోతున్నాయి. గతంలో మూలవాగుపై నిర్మి స్తున్న రెండో వంతెన వరదలో కొట్టుకుపోయింది. ఈనెల 25న ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఇన్‌చార్జి కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ వేములవాడ శివారులోని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను పరిశీలిస్తుండగా బేస్‌మెంట్‌ కూలిపోయిన విష యం తెలిసిందే. ఈ సంఘటనల నేపథ్యంలో అభివృద్ధి పనుల నాణ్యతపై అనుమానాలు కలుగుతున్నాయి.

కోట్ల నిధులు.. కూలుతున్న సౌదాలు

వేములవాడ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులకు కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నారు. అయితే పనులు చేయడంలో నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్లు నాణ్యత పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మూలవాగుపై రెండో వంతెన నిర్మిస్తుండగా వరదకు కొట్టుకుపోవడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు. అదే సమయంలో నిర్మాణంలో ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల బేస్‌మెంట్‌ కుంగిపోవడం వెనుక నాణ్యత లేకపోవడమేననే చర్చ సాగుతోంది. మూలవాగుపై రెండు వంతెనల నిర్మాణానికి రూ.13 కోట్లు కేటాయిస్తే ఒకే వంతెన మాత్రమే పూర్తయింది. రెండో వంతెన పనులు కొనసా..గుతూనే ఉన్నాయి. తిప్పాపూర్‌ శివారులో రూ.7.63కోట్లతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మిస్తున్నారు. 12 బ్లాకులు.. ఒక్కో బ్లాకులో 12 ఇళ్ల చొప్పున 144 గృహాలను నిర్మిస్తున్నారు. పనులు కొనసాగుతుండగానే బేస్‌మెంట్‌ కుంగిపోవడంపై ఎంతపాటి నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారో తెలుస్తోందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికై నా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

కూలుతున్నాయ్‌..!1
1/2

కూలుతున్నాయ్‌..!

కూలుతున్నాయ్‌..!2
2/2

కూలుతున్నాయ్‌..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement