భక్తులతో మర్యాదపూర్వకంగా మెలగాలి
● హోంగార్డులకు ఈవో రమాదేవి సూచనలు
వేములవాడ: భక్తులతో మర్యాదగా ప్రవర్తించా లని ఆలయ ఈవో రమాదేవి హోంగార్డులకు సూచించారు. భీమేశ్వర సదన్‌లో బుధవారం పలు సూచనలు ఇచ్చారు. విధుల్లో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వేతనాలు, ఇతర సమస్యలుంటే తన దృష్టికి తేవాలని తెలిపారు. క్రమశిక్షణ పాటించకుంటే ఎస్పీకి సరెండర్ చేస్తానని హెచ్చరించారు.
సిరిసిల్లటౌన్: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని బుధవారం బీజేపీ జిల్లా ఆఫీస్‌లో ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలకు దిశానిర్దేశం చేసిన రాజ్యాంగం విలువలను కాపాడాలని కోరారు. పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మ్యాన రాంప్రసాద్, జిల్లా ఆఫీస్ ఇన్‌చార్జి భాగయ్య, పట్టణ ఉపాధ్యక్షుడు మోర శ్రీహరి, పట్టణ కార్యదర్శి సూరం వినయ్, నాయకులు ఉరగొండ రాజు, శేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలో నిర్మించిన అర్బన్ షెల్టర్ నిర్వహణకు ఆసక్తి గల మహిళా స్వశక్తి సంఘాల నుంచి ప్రతిపాదనలు కోరుతున్నట్లు సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఎంఏ ఖదీర్‌పాషా ప్రకటనలో కోరారు. స్థానిక రాజీవ్‌నగర్ మినీ స్టేడియం వెనకాల నిరాశ్రయుల వసతి కోసం ప్రత్యేక బిల్డింగ్ నిర్మించి వినియోగంలోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. స్వశక్తి మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు తమ ప్రతిపాదనలను డిసెంబర్ 2వ తేదీ సాయంత్ర 5 గంటల్లోపు మెప్మా ఆఫీస్‌లో సమర్పించాలని తెలిపారు.
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని చెక్కపల్లి హైస్కూల్‌లో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి ఉమెన్స్ కబడ్డీలో మండలంలోని గాలిపల్లి హైస్కూల్ జట్టు విజేతగా నిలిచింది. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ జిల్లా స్థాయి కబడ్డీ టోర్నీ, ఎంపికలు నిర్వహించారు. విజేతలను హెచ్‌ఎం పావని, పీడీ సానబాబు అభినందించారు.
సిరిసిల్లటౌన్: దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీఐ టీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి బుధవారం సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్ ఎదుట చేపట్టిన ధర్నాలో మాట్లాడారు. ఔట్‌సోర్సింగ్ కార్మికులకు రావాల్సిన ఐదు నెలల పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. ఈమేరకు కార్యాలయంలో వినతిపత్రం అందించారు. మూశం రమేశ్, ఎగమంటి ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల ఎడ్యుకేషన్: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్(2025–26), అవార్డ్స్ ప్రదర్శన(2024–25) నవంబర్ 28, 29 తేదీల్లో సిరిసిల్లలోనీ గీతానగర్ హైస్కూల్‌లో నిర్వహించనున్నట్లు డీఈవో వినోద్ తెలిపా రు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్–గణితం(స్టెమ్), సుస్థిర వ్యవసాయం, హరితశక్తి, నీటిసంరక్షణ, వర్ధమాన సాంకేతికతలపై విద్యార్థులు ప్రాజెక్టులు ప్రదర్శించవచ్చని తెలిపారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో ఒక్కో పాఠశాల నుంచి గరిష్టంగా 14 ప్రాజెక్టులు మాత్రమే అనుమతిస్తారని స్పష్టం చేశారు. వివరాలకు జిల్లా సైన్స్ అధికారి పాముల దేవయ్య 99661 02646లో సంప్రదించాలని సూచించారు.
భక్తులతో మర్యాదపూర్వకంగా మెలగాలి
భక్తులతో మర్యాదపూర్వకంగా మెలగాలి
భక్తులతో మర్యాదపూర్వకంగా మెలగాలి


