ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు
● సైకాలజిస్ట్ పున్నంచందర్
సిరిసిల్ల: నేతకార్మికులు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని, ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా చేయొచ్చని సైకాలజిస్ట్ కె.పున్నంచందర్ పేర్కొన్నారు. స్థానిక గణేశ్‌నగర్‌లో బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. పున్నంచందర్ మాట్లాడుతూ పని బాధ్యతలు పెరుగుతున్న తరుణంలో కార్మికులు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. మద్యపానం, బీడీ, సిగరెట్లకు దూరంగా ఉండాలని సూచించారు. పోషకాహారం తీసుకుంటూ.. తగినంత విశ్రాంతి పొందాలన్నారు. మైండ్ కేర్ సెంటర్ సిబ్బంది రాపెల్లి లత, బూర శ్రీమతి, కొండ ఉమ, సామాజిక కార్యకర్త వేముల మార్కండేయులు నేత కార్మికులు పాల్గొన్నారు.
పరీక్షలంటే భయాన్ని వీడాలి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): విద్యార్థులు పరీక్షలంటే భయం వీడితేనే విజయం దక్కుతుందని సైకాలజిస్ట్ కె.పున్నంచందర్ పేర్కొన్నారు. మండలంలోని మండెపల్లి హైస్కూల్‌లో హెల్పింగ్‌హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ, తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అలువాల ఈశ్వర్, అడ్వకేట్ దాసరి తిరుమల, హెచ్‌ఎం అనురాధ, సజ్జనం శ్రీనివాస్, ఆంజనేయులు పాల్గొన్నారు.


