గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడలోని ఓ గార్డెన్‌లో బుధవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అండగా నిలుస్తున్నారనేందుకు జూబ్లిహిల్స్‌లో విజయమే నిదర్శనమన్నారు. బడుగు, బలహీనవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే మరింత అభివృద్ధి సాధ్యపడుతుందన్న అంశాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు.


