పంచాయతీల ఖజానా గలగల
● బిల్లులు చెల్లిస్తున్న ఆశావహులు
ముస్తాబాద్(సిరిసిల్ల): పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్ స్థానాల రిజర్వేషన్ల ప్రకటనతో ఆశావహులు తమ ప్రచారాన్ని షురూ చేశారు. ముస్తాబాద్ మండలంలోని 22 గ్రామాల్లో ఎన్నికల సందడి కనిపిస్తోంది. అధికార పార్టీ కాంగ్రెస్‌తోపాటు బీఆర్‌ఎస్, బీజేపీలకు చెందిన నాయకులు ఎన్నికల బరిలో ఉన్నామంటూ ఇంటింటా ప్రచారం మొదలుపెట్టారు. బరిలో నిలబడేందుకు సమాయత్తమవుతున్నారు. ఈమేరకు పంచాయతీ కార్యాలయాలలో ఇంటిపన్ను, నల్లాబిల్లులు కడుతున్నారు. స్థానిక సమరంలో నిలబడేందుకు బకాయిలు ఉండరాదనే నిబంధనతో పంచాయతీల ఖజానా కలకలలాడుతోంది. పన్నుల వసూలు కోసం మేజర్ పంచాయతీలలో ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేశారు.


