మహిళలపై వివక్ష రూపుమాపాలి
● జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం
సిరిసిల్ల: మహిళలపై వివక్షను రూపుమాపాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం కోరారు. మహిళలపై హింస నివారణ పక్షోత్సవాల సందర్భంగా సిరిసిల్లలో మంగళవారం అవగాహన సదస్సును నిర్వహించారు. లక్ష్మీరాజం మాట్లాడుతూ మహిళల హక్కులను గుర్తించి, గౌరవించాలన్నారు. మద్యపానం, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కోరారు. మహిళా సాధికారికత కేంద్రం కోఆర్డినేటర్ రోజా, నషా ముక్త్ భారత అభియాన్ కోఆర్డినేటర్ జనార్దన్, లీగల్ ఆఫీసర్ అంజయ్య, ప్రిన్సిపాల్ శాంతికిరణ్ పాల్గొన్నారు.


