ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
● అదనపు కలెక్టర్ నగేశ్
ఇల్లంతకుంట/బోయినపల్లి: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, ధాన్యం కోతలు విధించొద్దని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ సూచించారు. ఆయిల్‌పామ్‌తో ఎన్నో లాభాలు ఉన్నాయని, రైతులు సాగుచేయాలని సూచించారు. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపురం, అనంతారం, పొత్తూరు, గాలిపల్లి, ముస్కానిపేట, బోయినపల్లి మండలం స్తంభంపల్లి, అనంతపల్లి, కోరెం, తడగొండ, బోయినపల్లి, కొదురుపాక, మాన్వాడ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను మంగళవారం పరిశీలించారు. లారీల సమస్యను నిర్వాహకులు అదనపు కలెక్టర్ దృష్టికి తేగా.. బుధవారం నుంచి అదనంగా లారీలను పంపిస్తామని తెలిపారు. తహసీల్దార్ ఎంఏ ఫరూక్, కాలె నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
30 నుంచి ఎనిమిదో రాష్ట్ర పోటీలు
సిరిసిల్లటౌన్: జిల్లా కేంద్రంలో ఈనెల 30 నుంచి డిసెంబర్ 3 వరకు రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్ తెలిపారు. సిరిసిల్లలోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ప్రెస్‌మీట్లో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరుకానున్నట్లు తెలిపారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చింతకింది శ్యామ్, దర్శనాల రామస్వామి, మాదాసు లక్ష్మణ్, కోడం శ్రీనివాస్, గుడ్ల రవి పాల్గొన్నారు.
హలో కళాకారులు... చలో కరీంనగర్
సిరిసిల్లటౌన్: తెలంగాణ జానపద సకల వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర ఆవిర్భావ సదస్సు పోస్టర్‌ను సంఘ సేవకులు, గవర్నర్ అవార్డు గ్రహీత తాళ్లపెల్లి సంధ్య ఆవిష్కరించారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈనెల 28న కరీంనగర్ కళాభారతిలో జరిగే రాష్ట్ర సదస్సుకు కళాకారులు తరలిరావాలని కోరారు. కళాకారులు దాట్ల నిర్మల, ఎద్దు మమత, ఎడ్మల శ్రీధర్‌రెడ్డి, వేముల మార్కండేయ, గూడూరు శ్రీకాంత్, బండారి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
పద్యరచనలో విద్యార్థుల సత్తా
ముస్తాబాద్(సిరిసిల్ల): తెలంగాణ సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి పద్య రచన పోటీల్లో ఎల్లారెడ్డిపేట విద్యార్థులు సత్తా చాటారు. ఎల్లారెడ్డిపేట హైస్కూల్ విద్యార్థులు సారిక, దివ్యజ్యోతి, హర్షిణి, సంజన, నందిని ప్రతిభ కనబర్చారని హెచ్‌ఎం మనోహరాచారి తెలిపారు. తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ఆచార్య డాక్టర్ చెన్నయ్య చేతుల మీదుగా బహుమతులు అందుకున్నట్లు తెలిపారు.
కుటుంబ నియంత్రణ శిబిరం
వేములవాడఅర్బన్: స్థానిక ఏరియా ఆస్పత్రిలో మంగళవారం కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స శిబిరం నిర్వహించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య తెలిపారు. 31 మంది పురుషులకు కుటుంబ నియంత్రణ కోత, కుట్టులేని ఆపరేషన్లు చేసినట్లు వివరించారు. డాక్టర్లు రమేశ్, సంపత్‌కుమార్, దివ్య ఉన్నారు.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి


