● పార్టీని మరింత బలోపేతం చేద్దాం ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● డీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు ‘సంగీతం’కు అప్పగింత
సిరిసిల్లటౌన్: ప్రజా ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీపైనే ఉన్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మంగళవారం డీసీసీ కార్యాలయంలో సంగీతం శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాబోయే కాలంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కొత్తగా డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సంగీతం శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
‘సంగీతం’కు అభినందనల వెల్లువ
కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సంగీతం శ్రీనివాస్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సంగీతం శ్రీనివాస్‌లకు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, గడ్డం నర్సయ్య, సూర దేవరాజు, ఆడెపు చంద్రకళ, మడుపు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.


