ఉత్సాహంగా అథ్లెటిక్స్
సిరిసిల్లటౌన్/సిరిసిల్లఅర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సోమవారం బాలికల విభాగంలో అండర్–14,16 అస్మిత అథ్లెటిక్స్ లీగ్ పోటీలు నిర్వహించారు. సైకియాట్రిస్ట్ పున్నంచందర్ పోటీలను ప్రారంభించారు. జిల్లాలోని 13 మండలాల నుంచి సుమారు 150 మంది పాల్గొన్నారు. రన్నింగ్, జావెలిన్ త్రో, షాట్‌పుట్, లాంగ్‌జంప్‌లో పలువురు సత్తాచాటారు. అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, అబ్జర్వర్ గుండ సునంద్, డీవైఎస్‌వో అజ్మీరరాందాస్, ప్రిన్సిపాల్ రఘునందన్ తదితరులు ఉన్నారు.
ఉత్సాహంగా అథ్లెటిక్స్
ఉత్సాహంగా అథ్లెటిక్స్
ఉత్సాహంగా అథ్లెటిక్స్


