పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి
సిరిసిల్లటౌన్: పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని సెస్ అసిస్టెంట్ హెల్పర్లు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ తీసి కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ ఎలక్ట్రిసిటి ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు మాట్లాడారు. కోఆపరేటివ్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలని, కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరారు. తదితర డిమాండ్లలో కూడిన వినతి పత్రాన్ని కార్యాలయంలో అందజేశారు. యూనియన్ అధ్యక్షుడు కె.ఈశ్వర్‌రావు, వి.గోవర్ధన్, నలువాల స్వామి, ప్రసాద్, మధు తదితరులు పాల్గొన్నారు.


