నిరుపేదలు గౌరవంగా బతకాలి
● విప్ ఆది శ్రీనివాస్
వేములవాడఅర్బన్: ఇందిరమ్మ ఇళ్లతో లబ్ధిదారుల్లో ఆనందం నెలకొంటుందని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్‌లో సగ్గు లావణ్య– శ్రీనివాస్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసి సోమవారం గృహ ప్రవేశం చే శారు. ఈ సందర్భంగా విప్ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి మాట్లాడారు. ప్రతీ నిరుపేద కుటుంబం గౌరవప్రదమైన నివాసం కలిగి, సంతోషంగా జీవించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం అన్నా రు. పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, సాగరం వెంకటస్వామి, ఎండీ ఇర్ఫాన్, నాగుల విష్ణు, దుర్గం పర్శరాములు, సాబీర్ తదితరులు ఉన్నారు.


