భట్టిని కలిసిన సంగీతం
సిరిసిల్లటౌన్: నూతనంగా నియమితులైన డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ సోమవారం హైదరాబాద్‌లో డెప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
గంభీరావుపేట(సిరిసిల్ల): స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని నాఫ్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు అన్నారు. సోమవారం మండలంలోని పార్టీ కార్యాలయంలో రాబోయే ఎన్నికలపై మార్గనిర్దేశనం చేశారు. పార్టీ బలపరిచే అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. నాయకులు వెంకటస్వామిగౌడ్, దయాకర్‌రావు, భూపతి సురేందర్, వెంకటియాదవ్, రామానుజాగౌడ్, రాజేందర్, గంధ్యాడపు రాజు, వహీద్ తదితరులు పాల్గొన్నారు.


