బాధితులకు భరోసా గ్రీవెన్స్
సిరిసిల్లక్రైం: సమస్యల పరిష్కారం లక్ష్యంగా, బాధితులకు భరోసాగా ఉండేందుకు జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గితే తెలిపారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా 32 ఫిర్యాదులు స్వీకరించినట్లు వివరించారు. ఫిర్యాదులపై ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి, బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. స్టేషన్‌కి వచ్చిన ఫిర్యాదుదారులతో పోలీస్ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించి ఫిర్యాదులు స్వీకరించాలని సూచించారు. అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, దీంతో ఫిర్యాదుదారుకు పోలీస్‌శాఖపై భరోసా కలుగుతుందన్నారు.


