సమస్యల‘వాణి’.. పరిష్కరించాలని
ప్రజావాణికి వెల్లువలా దరఖాస్తులు
స్వీకరించిన ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్
సిరిసిల్లఅర్బన్: ప్రజావాణి సమస్యలను సత్వరం పరిష్కరించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 143 దరఖాస్తులు వచ్చాయి. ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలనికలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సింగారం గ్రామానికి చెందిన 11 మంది లబ్ధిదారులం గత ప్రభుత్వ హయాంలో అప్పు చేసి డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టుకున్నాం. కొందరివి అసంపూర్తిగా ఉన్నాయి. లబ్ధిదారులకు ఇస్తామన్న రూ.5 లక్షలు ఇప్పటికీ ఇవ్వలేదు. రెండేళ్లుగా బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకుంటలేరు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి బిల్లులు మంజూరు చేయాలి.
– సింగారం గ్రామస్తులు
సిరిసిల్ల పట్టణంలోని వెంకంపేటలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణాన్ని మరో చోటుకు మార్చాలి. జనావాసాల మధ్య మద్యం షాపు ఏర్పాటు చేయడం వల్ల మహిళలు, విద్యార్థులు, పిల్లలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది.
– ఆనంద మిత్రమండలి అసోసియేషన్
రంగనాయకసాగర్ నుంచి జిల్లెల్ల అగ్రికల్చర్ మీదుగా మల్లాపూర్ వరకు సాగునీటి కాలువ పనులను కాంట్రాక్టర్ అసంపూర్తిగా వదిలేశాడు. కాలువ పూర్తిచేస్తే ఈ ప్రాంత రైతులకు సాగునీటి కరువు ఉండదు. పనులు త్వరగా పూర్తి చేసి రైతులను ఆదుకోవాలి.
– రైతు సంక్షేమ సంఘం బాధ్యులు, జిల్లెల్ల
మధ్యమానేరు జలాశయంలో ముంపునకు గురైన 18 ఇళ్లకు ఇప్పటికీ పరిహారం రాలేదు. పలుసార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఇప్పటికై నా నిర్వాసితుల వద్ద ఆధారాలు పరిశీలించి పరిహారం ఇప్పించాలి.
– చింతల్‌ఠాణా నిర్వాసితులు
సమస్యల‘వాణి’.. పరిష్కరించాలని
సమస్యల‘వాణి’.. పరిష్కరించాలని
సమస్యల‘వాణి’.. పరిష్కరించాలని
సమస్యల‘వాణి’.. పరిష్కరించాలని


