దక్షిణ ప్రాకారం తొలగింపు పనులు షురూ..
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల్లో భాగంగా ఆలయ దక్షిణ ప్రాకారం తొలగింపు పనులు శనివారం కొనసాగించారు. ఆలయ దక్షిణ భాగంలోని పలు గృహాల యజమానులు ఏమేరకు రోడ్డును ఆక్రమించుకుంటారో చెప్పకుండా రోడ్డుపై పిల్లర్లు వేసేందుకు రిగ్ చేస్తున్నారంటూ అడ్డు చెప్పారు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి హైడ్రారిగ్‌తో రోడ్డుపై పిల్లర్లు వేసేందుకు హోల్స్ చేయించారు. భారీ క్రేన్‌తో ప్రాకారం కూల్చివేత పనులు చేపట్టారు. నడిరోడ్డుపై పనులు జరుగుతున్న క్రమంలో జనసంచారం ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.


