మహిళల సంక్షేమమే ధ్యేయం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రుద్రంగి(వేములవాడ): మహిళల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రుద్రంగిలో ఇందిరా మహిళాశక్తి చీరలను పంపిణీ చేశారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి కోసమే మండల కేంద్రంలోని తాతమ్మగుడి వద్ద డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు భూమిపూజ చేసి, నిర్మించడం మరిచిపోయారన్నారు. రుద్రంగి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. రుద్రంగి ఏఎంసీ చైర్మచ్ చెలుకల తిరుపతి, మండల అధికారులు, డీసీసీ కార్యదర్శులు గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, తర్రె లింగం, నాయకులు పల్లి గంగాధర్, గండి నారాయణ తదితరులు పాల్గొన్నారు.


