డీపీవోలో ఉచిత కంటి వైద్యశిబిరం
సిరిసిల్ల క్రైం: జిల్లా పోలీస్ అధికారులు, కుటుంబ సభ్యుల కోసం శరత్ మ్యాక్స్ విజన్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్యశిబిరాన్ని ఎస్పీ మహేశ్ బి గీతే శనివారం ప్రారంభించారు. పోలీసులు ఆరోగ్య సంరక్షణపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన వైద్యశిబిరంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పరీక్షలు చేయించుకున్నారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, సీఐలు మొగిలి, శ్రీనివాస్, రవి, నాగేశ్వరరావు, మధుకర్, ఆర్‌ఐలు మధుకర్, రమేశ్, యాదగిరి పాల్గొన్నారు.


