రక్తపరీక్షలు శాసీ్త్రయంగా చేయాలి
● జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత
సిరిసిల్ల/తంగళ్లపల్లి: రక్తపరీక్షలను శాసీ్త్రయంగా విశ్లేషించాలని, వ్యాధుల నిర్ధారణలో రక్తపరీక్షలే కీలకమని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్స్(టీడీ) కేంద్రాన్ని శనివారం తనిఖీ చేశారు. రక్తపరీక్షల రికార్డులు పరిశీలించారు. జిల్లాలోని ఆస్పత్రుల నుంచి వచ్చే శ్యాంపిళ్లను జాగ్రత్తగా నమోదు చేసి, నివేదికలు ఖచ్చితత్వంతో అందించాలని సూచించారు. అనంతరం తంగళ్లపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. చిన్నపిల్లల తల్లిదండ్రులకు వ్యాధి నిరోధక టీకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. వైద్యాధికారి స్నేహ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఇల్లంతకుంట(మానకొండూర్): స్కూల్‌లో 20 మంది, అంగన్‌వాడీలో మరో 20 మంది పిల్లలు ఉన్నారని ఒకే టీచర్ సరిపోవడం లేదని, మరో టీచర్‌ను కేటాయించాలని మండలంలోని బోటుమీదిపల్లి గ్రామ మహిళలు కోరారు. ఈమేరకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు శనివారం వినతిపత్రం అందజేశారు. మండల కేంద్రంలో చీరల పంపిణీకి హాజరైన ఎమ్మెల్యేను కలిసి ఈమేరకు వినతిపత్రం అందజేశారు. స్కూల్‌కు ప్రహరీ కూడా మంజూరు చేయాలని కోరారు. గౌరవేణి రజిత, దీప, రేఖ, శారద, దేవకి, గొడుగు రవళి ఉన్నారు.
గంభీరావుపేట/ముస్తాబాద్(సిరిసిల్ల): కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు ఎప్పటికప్పుడు తీసుకోవాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ ఆదేశించారు. గంభీరావుపేట మండలంలోని సముద్రలింగాపూర్, గజసింగవరం, గోరింటాల, గంభీరావుపేట, లింగన్నపేట, ముస్తఫానగర్, ఎల్లారెడ్డిపేట మండలం ఎల్లారెడ్డిపేట, వెంకటాపూర్, పదిర, రాగట్లపల్లి, నారాయణపూర్, రాచర్లబొప్పాపూర్, తిమ్మాపూర్, కిషన్‌దాస్‌పేటల్లోని కొనుగోలు కేంద్రాలను శనివారం పరిశీలించారు. తహసీల్దార్‌లు మారుతిరెడ్డి, తహసీల్దార్ సుజాత తదితరులు ఉన్నారు.
సిరిసిల్ల: బాల్యవివాహాలను అరికట్టాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం కోరారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. లక్ష్మీరాజం మాట్లాడుతూ చిన్న వయసులో పెళ్లిళ్లు చేస్తే అనేక అనర్థాలు వస్తాయన్నారు. కళాశాల యువత డ్రగ్స్ బారిన పడొద్దని కోరారు. డ్రగ్స్‌తో మెదడు మొద్దు బారడం, కండరాలు పనిచేయకుండా పోతాయన్నారు. బాల్య వివాహాలు జరుగుతుంటే చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098, మహిళా హెల్ప్‌లైన్ 181లో సమాచారం ఇవ్వాలని కోరారు. ఉమెన్ ఎంపవర్‌మెంట్ కోఆర్డినేటర్ రోజా, టీమ్ మెంబర్ జనార్దన్, జెండర్ స్పెషలిస్ట్ దేవిక తదితరులు పాల్గొన్నారు.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని జిల్లా సహకార అధికారి రామకృష్ణ అన్నారు. మండలంలోని రామన్నపల్లి, అంకుశాపూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను శనివారం పరిశీలించారు. రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి కొనుగోలు కేంద్రం నుంచి నిత్యం రెండు లారీల ధాన్యం మిల్లులకు తరలించాలని ఆదేశించారు.
రక్తపరీక్షలు శాసీ్త్రయంగా చేయాలి
రక్తపరీక్షలు శాసీ్త్రయంగా చేయాలి
రక్తపరీక్షలు శాసీ్త్రయంగా చేయాలి


