పల్లెపోరుకు తొలి అడుగు
జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు
ఉమ్మడి జిల్లాలో స్థానికం ఇలా
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
పల్లె పోరుకు తొలి అడుగుగా రిజర్వేషన్ల ప్రక్రియ మొదలైంది. పాత పద్ధతిలో రిజర్వేషన్ ఉండనుండగా బీసీల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. మొత్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల విధివిధానాలను ఖరారు చేస్తూ కీలకమైన జీవో ను విడుదల చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల కు అనుగుణంగా మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఉండేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్ర కారం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను రొ టేషన్ పద్ధతిలో అమలు చేయనున్నారు. ఈ పద్ధతి ద్వారా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు సూచించింది. ఈ జీవోలో గిరిజన గ్రామాలకు సంబంధించి ఒక ప్రత్యేక నిబంధనను చేర్చింది. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు అన్నీ ఎస్టీలకే రిజర్వ్ చేయనున్నారు. సదరు ఉత్తర్వులతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఘట్టం పూర్తికావడంతో త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
– లోపలి పేజీలో
సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్లు
కరీంనగర్: 5,07,531, పెద్దపల్లి: 4,04,181
జగిత్యాల: 2,97,763, సిరిసిల్ల: 3,53,351
పంచాయతీలు: 1,226, వార్డులు: 4,978
ఎంపీటీసీలు: 646, జెడ్పీటీసీలు: 60


