ఆయన కూడా సహకరిస్తారు
రోజూ ఐదింటికే మొదలయ్యే దినచర్యలో భాగంగా ఇల్లు, వాకిలి శుభ్రం చేయడం, ఇద్దరు పిల్లల్ని స్కూల్‌కు తయారు చేయడం, వంటావార్పు, తర్వాత లంచ్ బాక్స్ రెడీ చేయడంతో ఒక దశ పూర్తవుతుంది. పది గంటలకల్లా కోర్టు విధులకు హాజరవుతాను. వివిధ రకాల సమస్యలతో కోర్టు మెట్లెక్కే బాధితులకు శాఖాపరమైన సూచనలు, సలహాలతో పాటు అవసరమైన అన్ని కర్తవ్యాలను నెరవేరుస్తాను. సాయంత్రం ఐదున్నరకు ఇంటికొచ్చాక మళ్లీ ఇంటి పనులతో బిజీ. దాంతో పాటు వృద్ధాప్యంలో ఉన్న అత్తగారి బాగోగులూ రోజువారీ చర్యలో భాగమే. ఇవన్నీ సమతూకం చేసుకునేందుకు సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకుంటాను. ఇంటి పనుల్లో మా ఆయన కూడా సహకరించడం నాకు కలిసొచ్చే అంశం.
– ఇ.జ్యోతి,
అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, సిరిసిల్ల


