మానీటి పాలు! | - | Sakshi
Sakshi News home page

మానీటి పాలు!

Nov 22 2025 7:44 AM | Updated on Nov 22 2025 7:44 AM

మానీట

మానీటి పాలు!

నీట మునిగిన భూములు ఇలా..

పెరిగిన మధ్యమానేరు బ్యాక్‌వాటర్‌

మునిగిన చేతికొచ్చిన పంటలు

కూలీలతో కోత.. తెప్పలపై తరలింపు

తడిసి మోపెడవుతున్న ఖర్చు

ఆవేదన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు

ఆరుగాలం శ్రమ..

వేములవాడఅర్బన్‌: వారంతా మిడ్‌మానేరు నిర్వాసితులు. మిగిలిన భూముల్లో పంటలు సాగుచేసుకొని బతుకుతుంటే బ్యాక్‌వాటర్‌ లెవల్‌ పెరిగి ఆ పంటలు సైతం నీటిలోనే మునిగిపోయాయి. ఆరుగాలం పడ్డ శ్రమంతా నీటిలోనే మునిగిపోవడంతో ఆ రైతుల వేదన అంతా.. ఇంతా కాదు. పంట చేతికొచ్చిందన్న ఆనందం అంతలోనే నీటిమునిగి పోయింది. ఆ పంటను కోసేందుకు ఖర్చు తడిసిమోపెడవుతుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిడ్‌మానేరు బ్యాక్‌వాటర్‌లో మునిగిన పంటలు.. రైతులు పడుతున్న తిప్పలుపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్టు.

మిడ్‌మానేరు సామర్థ్యం 27.55 టీఎంసీలు

బోయినపల్లి మండల పరిధిలో నిర్మించిన మిడ్‌మానేరు ప్రాజెక్టు సామర్థ్యం 27.55 టీఎంసీలు. ఈ ప్రాజెక్టులో బోయినపల్లి మండలంలోని కొన్ని గ్రామాలతోపాటు వేములవాడ మండలం సంకెపల్లి, ఆరెపల్లి, అనుపురం గ్రా మాలు ముంపునకు గురయ్యాయి. మిడ్‌మానేరు ప్రాజెక్ట్‌ పూర్తిగా నిండితే ఈ మూడు గ్రా మాల శివారు వరకు బ్యాక్‌వాటర్‌ చేరుతుంది.

నీటి మునిగిన పంటలు

మిడ్‌మానేరు ప్రాజెక్ట్‌ బ్యాక్‌వాటర్‌ను ఆనుకుని ఉన్న గ్రామాలు నాంపల్లి శివారు కొంత భాగం, సంకెపల్లి, ఆరెపల్లి, అనుపురం గ్రామాల రైతులు తమ పట్టా భూముల్లో వరి, పత్తి వేసుకుంటున్నారు. ఈసారి వర్షాలు ఎక్కువగా కురువడంతో బ్యాక్‌వాటర్‌ స్థాయి పెరిగి వరి, పత్తి చేన్లు మునిగిపోయాయి. కోతకు వచ్చిన వరిని కోయడం ఇబ్బందిగా మారింది. పంట పొలాల్లో నీరు చేరడంతో పత్తి ఏరేందుకు కూలీలు రావడం లేదు. వరి కోసేందుకు హార్వెస్టర్లు రాకపోవడంతో కూలీలను పెట్టి కోయిస్తున్నారు. ఇలా కోసిన వరిపంటను థర్మాకోల్‌ తెప్పల సహాయంతో ఒడ్డుకు తీసుకొస్తున్నారు. ఇలా తెచ్చిన పంటను మళ్లీ హార్వెస్టర్‌తో పట్టిస్తే వడ్లు వస్తాయి.

పెట్టుబడి రాదు

వరిపంట వేయడానికి ఎకరానికి రూ.25వేలు పెట్టుబడి కాగా.. ఇప్పుడు నీటిలో మునిగిన పంటను కోసి, ఒడ్డుకు తీసుకొచ్చేందుకు రూ.25వేలు కూలీలకు ఇస్తున్నారు. ఇలా ఒడ్డుకు తెచ్చిన వరిపంటను మళ్లీ హార్వెస్టర్‌లో వేస్తేనే వడ్లు వస్తాయి. ఇదంతా ఆర్థికంగా భారమే అయినప్పటికీ రెక్కలకష్టాన్ని నీళ్లల్లో వదిలేయలేక కోపిస్తున్నామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పరిశీలించి భవిష్యత్‌లో బ్యాక్‌వాటర్‌ ఇలా పంటలను ముంచకుండా చూడాలని కోరుతున్నారు.

గ్రామం విస్తీర్ణం

నాంపల్లి 15 ఎకరాలు

సంకెపల్లి 25 ఎకరాలు

ఆరెపల్లి 15 ఎకరాలు

అనుపురం 20 ఎకరాలు

మానీటి పాలు!1
1/2

మానీటి పాలు!

మానీటి పాలు!2
2/2

మానీటి పాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement