వేములవాడ ఏఎస్పీగా రుత్విక్‌సాయి | - | Sakshi
Sakshi News home page

వేములవాడ ఏఎస్పీగా రుత్విక్‌సాయి

Nov 22 2025 6:48 AM | Updated on Nov 22 2025 7:44 AM

● శేషాద్రినిరెడ్డి జగిత్యాలకు బదిలీ ప్రభుత్వాల మీద ఆధార పడొద్దు ● తలా ఇంత వేసుకొని గుడిని నిర్మించుకోవాలి ● హంపి పీఠాధిపతి విద్యారణ్యభారతీస్వామి మొరాయిస్తున్న మీసేవ సర్వర్లు చందుర్తి సింగిల్‌విండో బాధ్యతలు స్వీకరణ గుండ్లపల్లిలో ఎలుగుబంటి

● శేషాద్రినిరెడ్డి జగిత్యాలకు బదిలీ

వేములవాడ: వేములవాడ ఏఎస్పీగా రుత్విక్‌సాయి కొట్టెను ప్రభుత్వం నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది గ్రేహౌండ్స్‌లో విధులు నిర్వహిస్తున్న రుత్విక్‌సాయికి వేములవాడ ఎస్‌డీపీవోగా పోస్టింగ్‌ ఇచ్చారు. ఇక్కడ ఎస్‌డీపీవోగా విధులు నిర్వహించిన ఏఎస్పీ శేషాద్రిరెడ్డిని జగిత్యాలకు బదిలీ చేశారు.

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మూడేళ్లుగా గుడిని నిర్మించుకోలేక నిద్రపోతున్నారా? తొందరగా నిర్మించుకోవాలని, నిధులను స్వతహాగా తలా ఇంత పోగుచేసుకోవాలని హంపి పీఠాధిపతి విద్యారణ్యభారతీస్వామి సూచించారు. గుడి నిర్మాణం కోసం ఆలయ కమిటీ ముందుండాలని హితవు పలికారు. ఎల్లారెడ్డిపేటలోని వేణుగోపాలస్వామి ఆలయ పునర్‌నిర్మిస్తున్న సందర్భంగా హంపి పీఠాధిపతిని ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. స్వామి వారు విచ్చేసి ఆలయ పరిసరాలు పరిశీలించిన సందర్భంగా పై విధంగా స్పందించారు. గుడినిర్మాణానికి పాతరాయిని వాడుకోవచ్చని తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదం అందజేసి ఆశీర్వదించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ గుండం సుధాకర్‌రెడ్డి, అర్చకులు నవీన్‌చారి ఉన్నారు.

కోనరావుపేట(వేములవాడ): మీసేవ కేంద్రాల్లో సర్వర్లు పనిచేయకపోవడంతో వినియోగదారులు సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులు పడ్డారు. నాలుగు రోజులుగా జిల్లాలోని అన్ని మీసేవ కేంద్రాల్లోని సీడీఎంఏ సర్వర్‌ పనిచేయడం లేదు. ఈనెల 18 నుంచి కొన్ని రకాల సేవలు అందడం లేదు. పుట్టిన తేదీ సర్టిఫెకెట్లు, మరణ ధ్రువీకరణపత్రాలు జారీకావడం లేదు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

చందుర్తి(వేములవాడ): హైకోర్టు ఆదేశాలతో చందుర్తి సింగిల్‌విండో పాలకవర్గం శుక్రవారం బాధ్యతలు స్వీకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా స హకార సంఘాల పదవీకాలం పొడగిస్తూ ప్ర భుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. చందుర్తి సింగిల్‌విండో పాలకవర్గాన్ని రద్దు చేసి ప్రత్యేకాధికారిని నియమించింది. పాలకవర్గాన్ని రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో సింగిల్‌విండో అధ్యక్షుడు తిప్పని శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు పుల్కం మోహన్‌, డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. సీఈవో శ్రీవర్ధన్‌ ఉన్నారు.

ఇల్లంతకుంట(మానకొండూర్‌): మండలంలోని వంతడుపుల అనుబంధ గ్రామం గుండ్లపల్లిలో ఎలుగుబంటి సంచరిస్తుందన్న రైతుల సమాచారంతో జిల్లా ఫారెస్ట్‌ అధికారులు శుక్రవారం పరిసరాలు పరిశీలించారు. మండలంలో వా రం రోజులుగా గాలిపెల్లి, వడ్లూరు పారువెల్ల సమీపంలో ఎలుగుబంటి సంచరిస్తోందని ఆయా గ్రామాల ప్రజలు అంటున్నారు. ఈమేరకు ఫారెస్ట్‌ అధికారులు ఎలుగుబంటి ఆచూకీ కోసం రైతులతో కలిసి గాలింపు చేపట్టారు.

నాణ్యమైన విత్తనాలు అందించాలి

సిరిసిల్లఅర్బన్‌: రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేలా చూడాలని జిల్లా వ్యవసాయాధి కారి అఫ్జల్‌బేగం కోరారు. చంద్రంపేట రైతువేదికలో రైతువిజ్ఞాన కేంద్రం కరీంనగర్‌ ఆధ్వర్యంలో నూతన విత్తన బిల్లు–2025 ముసాయిదాపై శుక్రవారం చర్చాగోష్టి నిర్వహించారు. రైతువిజ్ఞన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ కె.మదన్‌మోహన్‌రెడ్డి విత్తనబిల్లు గురించి గురించి పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. శాస్త్రవేత్త జి.ఉషారాణి, సీడ్‌ సర్టిఫికేషన్‌ ఆఫీసర్‌ నవీన్‌రెడ్డి, సునీల్‌ తదితరులు ఉన్నారు.

వేములవాడ ఏఎస్పీగా రుత్విక్‌సాయి1
1/3

వేములవాడ ఏఎస్పీగా రుత్విక్‌సాయి

వేములవాడ ఏఎస్పీగా రుత్విక్‌సాయి2
2/3

వేములవాడ ఏఎస్పీగా రుత్విక్‌సాయి

వేములవాడ ఏఎస్పీగా రుత్విక్‌సాయి3
3/3

వేములవాడ ఏఎస్పీగా రుత్విక్‌సాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement