మహిళల ఆర్థిక ఉన్నతితో ప్రగతి
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ఇందిరమ్మ చీరలు పంపిణీ
వేములవాడరూరల్/వేములవాడఅర్బన్/చందుర్తి: మహిళల ఆర్థిక ఉన్నతితో రాష్ట్ర ప్రగతి సాధ్యమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి, వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం, చందుర్తి మండలం మల్యాల గ్రామాల్లో ఇందిరా మహిళాశక్తి చీరలను శుక్రవారం పంపిణీ చేశారు. ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో 1.45లక్షల మహిళలకు చీరలు అందజేస్తున్నామన్నారు. మధ్యమానేరు ముంపు గ్రామాల్లోని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, డీఆర్డీవో శేషాద్రి, కాంగ్రెస్ పార్టీ మండలాల అధ్యక్షులు వకుళాభరణం శ్రీనివాస్, పిల్లి కనకయ్య, ఏఎంసీ డైరెక్టర్ పాలకుర్తి పర్శరాములు, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశ్ పాల్గొన్నారు.


