పకడ్బందీగా విజిబుల్ పోలీసింగ్
● ఎస్పీ మహేశ్ బీ గీతే
తంగళ్లపల్లి(సిరిసిల్ల): విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా తంగళ్లపల్లి ఠాణాను శుక్రవారం తనిఖీ చేశారు. ఎస్పీ మహేశ్ బీ గీతే మాట్లాడుతూ ప్రజలకు చేరువ కావాలన్నారు. రౌడీషీటర్లు, ిహిస్టరీ షీటర్లపై నిఘా పెట్టాలన్నారు. సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, ఎస్సై ఉపేంద్రచారి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
రిజర్వేషన్లపై కసరత్తు
సిరిసిల్ల: గ్రామపంచాయతీ పాలకవర్గాల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లాస్థాయిలో సన్నాహాలు మొదలయ్యాయి. గ్రామపంచాయతీల రిజర్వేషన్లు ఖరారుకు అధికారులు కసరత్తు చే స్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, జెడ్పీ సీఈవో వినోద్, డిప్యూటీ సీఈవో గీత, డీపీవో షరీ ఫొద్దీన్ కలెక్టరేట్‌లో సమీక్షించారు. గతంలో ప్రకటించిన రిజర్వేషన్లలో కొద్దిపాటి మార్పులతో ఖరారు చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో పెద్దగా మార్పులు ఉండబో వని, బీసీ స్థానాలు జనరల్‌గా మారే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రిజర్వేషన్లు తుది రూపానికి వచ్చాక కలెక్టర్ ఆమోదంతో రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు. ఈమేరకు కలెక్టరేట్‌లో శుక్రవారం రా త్రి వరకు అధికారులు శ్రమించడం విశేషం.
పకడ్బందీగా విజిబుల్ పోలీసింగ్


