అడిగిన బుక్స్ తెప్పిస్తున్నారు
జిల్లా గ్రంథాలయానికి 2023 నుంచి వచ్చి చదువుకుంటున్నాను. ఏఈఈ పోస్టుల పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న. ఏమైనా పుస్తకాలు, మెటీరియల్ కావాలని కోరితే మేనేజ్‌మెంట్ వెంటనే తెప్పిస్తున్నారు. అన్ని విభాగాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. డిజిటల్ ల్రైబ్రరీగా మార్చితే బాగుంటుంది.
– యేశ శ్రీనివాస్, సిరిసిల్ల
నేను మొదటి నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను. ఇప్పటికీ నా స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ వినియోగించను. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది నా లక్ష్యం. ఉద్యోగం సాధించాకే మొదటి వాట్సాప్ స్టేటస్‌ను పెట్టుకుంటాను. ఏడాదిలో అన్ని రోజులూ లైబ్రరీని అందుబాటులో ఉంచితే బాగుంటుంది. – బొడ్డు రమ్యకృష్ణ, సిరిసిల్ల
అడిగిన బుక్స్ తెప్పిస్తున్నారు


