సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట పీహెచ్‌సీలో మంగళవారం మండల వైద్యాధికారి సారియా అంజూమ్ ఆధ్వర్యంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. 20 మంది టీబీ బాధితులకు ఫుడ్ బాస్కెట్ పంపిణీ చేశారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా బాధితులను దత్తత తీసుకునేందుకు డీఎంహెచ్‌వో డా.రజిత పిలుపు మేరకు పీపుల్స్ హాస్పిటల్ ముస్తాబాద్, డాక్టర్ శంకర్ న్యూట్రీషన్ ఫుడ్ అందజేశారు. బాధితులను 6 నెలలు పాటు దత్తత తీసుకున్నారు. ప్రతినెలా రూ.600 విలువ గల నిత్యవసర వస్తువులు ఇవ్వనున్నారు. ఈసందర్భంగా డీఎంహెచ్‌వో టీబీ రాకుండ తగు జాగ్రత్తలు వివరించారు. కాలానుగుణ వ్యాధులు రాకుండా డ్రై డే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సిబ్బంది అనిత, బాలచందర్, సూపర్‌వైజర్ మహిపాల్, పద్మ తదితరులు పాల్గొన్నారు.


