15న ప్రత్యేక లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

15న ప్రత్యేక లోక్‌ అదాలత్‌

Nov 5 2025 8:15 AM | Updated on Nov 5 2025 8:15 AM

15న ప

15న ప్రత్యేక లోక్‌ అదాలత్‌

మోడల్‌ సోలార్‌ గ్రామంగా ఎల్లారెడ్డిపేట ● కేంద్ర ప్రభుత్వ గ్రాంట్‌ రూ.కోటికి అర్హత

సిరిసిల్లకల్చరల్‌: అపరిష్కృతంగా ఉన్న కేసుల సత్వర పరిష్కారం కోసం ఈ నెల 15న ప్రత్యేక లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మొదటి అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయమూర్తి ఇన్‌చార్జ్‌ జిల్లా సెషన్స్‌ జడ్జి బి. పుష్పలత పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా న్యాయస్థాన సముదాయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. సంప్రదింపులు, పరస్పర చర్చల ద్వారా తేల్చుకోదగిన కేసులను గుర్తించి అదాలత్‌లో శాశ్వత పరిష్కారం అయ్యేలా చూడాలని న్యాయవాదులకు సూచించారు. చెక్‌ బౌన్స్‌, క్రిమినల్‌, సివిల్‌, కుటుంబ వివాదాలు, మోటార్‌ వాహనాల కేసులు, బ్యాంక్‌, బీమా కంపెనీలకు సంబంధించిన కేసులను ఎక్కువ సంఖ్యలో గుర్తించి లోక్‌ అదాలత్‌ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకునేలా కక్షిదారులకు సూచించాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి రాధికాజైస్వాల్‌, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జూపెల్లి శ్రీనివాసరావు, న్యాయవాదులు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మోడల్‌ సోలార్‌ గ్రామంగా జిల్లాలోని ఎల్లారెడ్డిపేట గ్రామాన్ని కేంద్రం ఎంపిక చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నందున రూ.కో టి గ్రాంట్‌ మంజూరు చేసింది. ఈమేరకు మంగళవారం మండల పరిషత్‌లో డీఆర్‌డీఏ శేషాద్రి, మండల ప్రత్యేకాధికారి అఫ్జల్‌ బేగం ఆయాశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో కేంద్ర ప్రభుత్వ ఆశయాల మేరకు పనిచేయాలని అధికారులు సూచించారు. ఆర్‌ఈడీసీవో మేనేజర్‌ మునీదర్‌రెడ్డి మాట్లాడుతూ, కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి ఈ పథకాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాలపైన వినియోగిస్తున్న కరెంట్‌ను పరిగణనలోకి తీసుకుని సోలార్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డీఎం లక్ష్మీకాంతరావు, ఎంపీడీవో సత్తయ్య, డీటీ మురళీ, సెస్‌ ఏడీ, ఏఈ పృథ్వీధర్‌ పాల్గొన్నారు.

ఏఎస్పీ విచారణ

ముస్తాబాద్‌(సిరిసిల్ల): ముస్తాబాద్‌లోని మానేరు కెనాల్‌ వద్ద గతంలో జరిగిన నిర్మాణాలపై కేసులు నమోదైన నేపథ్యంలో మంగళవారం ఏఎస్పీ చంద్రయ్య క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. కెనాల్‌పై సీసీ రోడ్డు నిర్మాణంతో దేవరాములుపై నీటిపారుదలశాఖ అధికారులు ఫిర్యాదు చేశారని ఎస్సై గణేశ్‌ తెలిపారు. అలాగే సీసీ నిర్మాణంలో తనపై దురుసుగా వ్యవహరించారని అధికారులపై దేవరాములు మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఏఎస్పీ ఫిర్యాదుదారులు, సాక్షులతో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు.

బకాయిలు విడుదల చేయాలి

వేములవాడఅర్బన్‌: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌, ఫీజురీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్‌ వద్ద ఒంటి కాలుపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కుర్ర రాకేశ్‌ మాట్లాడుతూ, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా విద్యారంగానికి ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిన పరిస్థితి ఉందన్నారు. రూ.8,500 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పెండింగ్‌లో ఉందన్నారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నాయకులు మంద అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు సామూహిక దీపారాధన

వేములవాడ: కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని రాజన్న ఆలయ అనుబంధ భీమేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో బుధవారం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఈవో రమాదేవి పేర్కొన్నారు. సాయంత్రం 6 నుంచి భీమేశ్వర సదన్‌ ఆవరణలో సామూహిక దీపారాధన నిర్వహిస్తామని తెలిపారు.

15న ప్రత్యేక లోక్‌ అదాలత్‌1
1/2

15న ప్రత్యేక లోక్‌ అదాలత్‌

15న ప్రత్యేక లోక్‌ అదాలత్‌2
2/2

15న ప్రత్యేక లోక్‌ అదాలత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement