ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
● మూస ధోరణికి స్వస్తి.. సేంద్రియంపై ఆసక్తి ● కాలానుగుణంగా ‘సాగు’తూ.. ● ఆదర్శంగా నిలుస్తున్న పలువురు అన్నదాతలు
సేద్యం..
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): సంప్రదాయ వరిసాగుకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటకు ఆదర్శ రైతు కొప్పుల సత్యనారాయణ– స్రవంతి దంపతులు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ పాలనలో ఆదర్శ రైతుగా ఎంపికై కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సత్యనారాయణ శిక్షణ తీసుకున్నాడు. సుమారు 25 రకాల దేశీ వరి ధాన్యాన్ని సంప్రదాయ పద్ధతిలో పండిస్తూ, వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నాడు. వీటిలో తెగుళ్లను తట్టుకునే దొడ్డు, సన్నరకాలు ఉన్నాయి. సుమారు 850 రకాల వరి విత్తనాలు తనవద్ద అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం డయాబెటిస్ విజృంభిస్తున్న తరుణంలో ఆర్గానిక్ ఉత్పత్తులైన బ్లాక్‌రైస్, రెడ్ రైస్, నవారు వరిపంటను పండిస్తున్నాడు. తోటి రైతులకు సాగులో సూచనలు అందిస్తున్నారు.
సత్యనారాయణ స్రవంతి దంపతులు
నీరుంటే వరి.. లేకుంటే పత్తి పంటలనే ఎక్కువగా సాగు చేస్తారు ఉమ్మడి జిల్లాలోని రైతులు. ‘పండితే పండుగ.. ఎండితే దండగ..’ అతివృష్టి.. అనావృష్టి ఏదైనా అన్నదాతకు తీరని నష్టాన్ని మిగుల్చుతోంది. ఒకే విధమైన పంటల సాగుతో భూసారం దెబ్బతింటోంది. పంటలకు వాడే రసాయనాలతో మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలువురు రైతులు కాస్త భిన్నంగా ఆలోచన చేస్తున్నారు. వివిధ రకాల పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో పోషక విలువలున్న పండ్ల తోటలు.. పాతకాలపు వరి విత్తనాలు.. తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి వచ్చే కూరగాయలు, ఆకుకూరలను మందులు పిచికారీ చేయకుండా, సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తున్నారు. మూసధోరణిలో కాకుండా కాలానికనుగుణంగా సేద్యం చేస్తూ.. తినేవారికి ఆరోగ్యాన్ని పంచుతూ.. పంటల విక్రయాలతో ఆదాయం గడిస్తున్న రైతులపై సండే స్పెషల్..!! – వివరాలు 8లోu
ఆర్గానిక్ బియ్యం
ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్ శ్రీ 2025


