ఆహ్లాదం కరువాయే..
స్మార్ట్‌సిటీలో పచ్చదనం కనుమరుగు బల్దియా నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం వట్టిపోతున్న పార్క్‌లు విరిగిన ఆట వస్తువులు పట్టింపులేని అధికారులు
ఈ ఫొటో జిల్లా కేంద్రంలోని కొత్తచెరువు(మినీ ట్యాంక్‌బండ్). కొత్తచెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.15కోట్లకు పైగా వెచ్చించింది. పిల్లలు ఆడుకునేందుకు ఆటవస్తువులు ఏర్పాటు చేయగా నిర్వహణ లోపంతో శిథిలమయ్యాయి. పచ్చదనం కనుమరుగవుతోంది. చెరువులో గుర్రపుడెక్క, కట్టపై పిచ్చిచెట్లతో కళావిహీనంగా మారింది. వాకర్స్‌పై కోతులు దాడులు చేస్తున్నాయి.
పార్కులు.. నిధులు
ఇది సిరిసిల్లలోని నెహ్రూపార్క్. ఇక్కడ వాటర్‌ఫౌంటేయిన్స్, పిల్లల ఆటవస్తువులు ఏర్పాటు చేశారు. మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో పనికిరాకుండా పోతున్నాయి. పార్కులో పాడుబడిన ఆటవస్తువులు, విరిగిన ఓపెన్‌జిమ్ పరికరాలు కనిపిస్తున్నాయి.
ఆహ్లాదం కరువాయే..
ఆహ్లాదం కరువాయే..


