ధాన్యం వర్షార్పణం
● వరదకు కొట్టుకుపోయిన వడ్లు
గంభీరావుపేట/ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి(సిరిసిల్ల): ఆరబోసిన ధాన్యం నీటిపాలైంది. కోతకొచ్చిన వరి నేలకొరిగింది. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో శనివారం రాత్రి కురిసిన వర్షానికి రైతులు ఆగమయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. వర్షపు నీటికి కొట్టుకుపోయింది. ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో 15 రోజులుగా ధాన్యం ఆరబోస్తున్నా కొనుగోలు చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీర్నపల్లిలో ఉదయం ఎండ రావడంతో రైతులు ధాన్యం ఆరబోయగా.. రాత్రి కురిసిన వర్షానికి తడిసి ముద్దయ్యింది.
అకాల వర్షాలు
సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు అకాల వర్షాలు కురిసాయి. ముస్తాబాద్‌లో అత్యధికంగా 25.7 మిల్లీమీటర్లు, రుద్రంగిలో 4.9, చందుర్తిలో 5.5, వేములవాడ రూరల్‌లో 1.3, బోయినపల్లిలో 0.8, వేములవాడలో 4.1, సిరిసిల్లలో 4.0, కోనరావుపేటలో 2.9, వీర్నపల్లిలో 4.1, ఎల్లారెడ్డిపేటలో 13.4, గంభీరావుపేటలో 2.6, తంగళ్లపల్లిలో 6.6, ఇల్లంతకుంటలో 7.8 మిల్లీమీటర్లు కురిసింది.
గంభీరావుపేట: వర్షపు నీటికి కొట్టుకుపోయిన వడ్లు
వీర్నపల్లిలో నేలకొరిగిన వరి పంట
ధాన్యం వర్షార్పణం
ధాన్యం వర్షార్పణం


