పట్టణాభివృద్ధి ప్రణాళిక అమలు చేయాలి
● ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ పకడ్బందీగా అమలు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. అమృత్–2.0 పథకంలో సిరిసిల్ల మున్సిపాలిటీలో మాస్టర్‌ప్లాన్ అమలుకు మొదటి కన్సల్టేటీవ్ వర్క్‌షాప్ కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జీఐఎస్ సాంకేతికత ఆధారంగా బేస్ మ్యాప్స్, ల్యాండ్ యూజ్ మ్యాప్స్, మాస్టర్‌ప్లాన్లు, అర్బన్ జియో–పోర్టల్ సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఇప్పటికే డ్రోన్ సర్వే పూర్తిచేయడంతో పాటు సోషియో ఎకమిక్ సర్వే నిర్వహించినట్లు వెల్లడించారు. మున్సిపాలిటీ పరిఽ దిలో శాఖల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, భవిష్యత్‌లో చేపట్టబోయే పనుల ప్రణాళికల వివరాలు అందించాలని సూచించారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, జీఐఎస్ హబ్ డీటీసీపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ అశ్వినీయాదవ్, వరంగల్ డీటీసీపీవో ఏడీ జ్యోతి, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా, డీటీసీపీవో అన్సారి పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లో ధాన్యం కొనుగోళ్లపై మాట్లాడారు. రెండో బైపాస్‌రోడ్డులోని పెట్రోల్‌బంక్‌లో పనిచేసే దివ్యాంగులు కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. ఇన్‌చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న గరీమా అగ్రవాల్‌కు రాజన్న ప్రసాదాన్ని ఈవో రమాదేవి అందించారు. ఆలయ అభివృద్ధి, విస్తరణ పనుల ప్రగతిని వివరించారు. అనంతరం హైదరాబాద్ నుంచి సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి వేర్వేరుగా నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌ల్లో పాల్గొన్నారు. డీఆర్‌డీవో శేషాద్రి, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ ప్రవీణ్, అదనపు డీఆర్డీవో శ్రీనివాస్, డీపీఎం వంగ రవీందర్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, తహసీల్దార్లు మహేశ్‌కుమార్, విజయప్రకాశ్‌రావు, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, రహమాన్ పాల్గొన్నారు.
నిబంధనల ప్రకారం కొనుగోళ్లు చేపట్టాలి
సిరిసిల్ల అర్బన్: నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. పెద్దూరులోని మెప్మా కొనుగోలు కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. ఇన్‌చార్జి కలెక్టర్ మాట్లాడుతూ తేమ శాతం 17 రాగానే కొనుగోళ్లు ప్రారంభించాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు తమ పరిధిలోని కొనుగోలు కేంద్రాలను తప్పకుండా సందర్శించాలన్నారు. ఏ– గ్రేడ్‌కు క్వింటాలుకు రూ.2,389, కామన్ రకానికి రూ.2,369 మద్దతు ధర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఆర్డీవో వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల అధికారి చంద్రప్రకాశ్, తహసీల్దార్ మహేశ్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీబేగ్ పాల్గొన్నారు.


