కొనుగోలు కేంద్రంలోనే మక్కలు అమ్ముకోవాలి
ఇల్లంతకుంట(మానకొండూర్): మొక్కజొన్న రైతులు తాము పండించిన మక్కలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. మండల కేంద్రంలోని ఏఎంసీ ఆవరణలో శనివారం మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడా రు. మండలంలో 600 ఎకరాల వరకు మొక్కజొన్న సాగు చేశారని 25 వేల క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చినట్లు తెలిపారు. బస్టాండ్ సమీప ప్రాంతంలోని ఇళ్ల యజమానులు ఎమ్మెల్యేను కలిసి బస్టాండ్ ఆవరణలో మరుగుదొడ్లు నిర్మించవద్దని కోరారు. ఎంపీడీవో శశికళ, మండల వ్యవసాయాధికారి సురేశ్‌రెడ్డి, ఏఎంసీ కార్యదర్శి హరినాథ్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎలగందుల ప్రసాద్, డైరెక్టర్లు నరసింగం, వెంకటరెడ్డి, రాజేశం, వీరేశం, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్తులు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని మండెపల్లిలో గ్రామస్తులు ఎల్లమ్మ కమాన్ వద్ద శనివారం ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు. వారు మాట్లాడుతూ తమ గ్రామం నుంచి ఇసుక వేబిల్స్ ఇవ్వడం ఆపాలని డిమాండ్ చేశారు. రోడ్లు చిన్నగా ఉండడంతో ఇబ్బంది పడుతున్నామని, ఇసుక ట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలు జరిగితే ఎవరూ బాధ్యులు అని ప్రశ్నించారు.
ఆర్‌ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆర్‌ఎంపీ, పీఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని, మందులు, ఇంజక్షన్లు, గ్లూకోజ్‌లు పెట్టరాదని జిల్లా వైద్యాధికారి రజిత సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలోని రాచర్లగుండారంలో ఆర్‌ఎంపీ చికిత్స కేంద్రాన్ని శనివారం తనిఖీ చేసి, కేంద్రాన్ని సీజ్ చేశారు. అర్హత లేకుండా వైద్యం అందించి ఓ బాలుడి ఆరో గ్యం క్షిణించడానికి కారణమయ్యరన్నారు. ప్రస్తుతం శివాన్ష్ ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారి డాక్టర్ సంపత్, మహేశ్‌గౌడ్ ఉన్నారు.
కొనుగోలు కేంద్రంలోనే మక్కలు అమ్ముకోవాలి
కొనుగోలు కేంద్రంలోనే మక్కలు అమ్ముకోవాలి


