
కేసులు అప్రజాస్వామికం
సిరిసిల్లటౌన్: పౌరహక్కులకు భంగం కలిగించే ప్రభుత్వాల చర్యలపై పాత్రికేయులు వార్తలు రాస్తే.. ఏపీలో కూటమి ప్రభుత్వం కేసులు పెట్టడం హాస్యాస్పదమని పలువురు జర్నలిస్టులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఖండించారు. జర్నలిస్టుల స్వేచ్ఛపై ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం అప్రజాస్వామ్యమే అవుతుందన్నారు. ప్రజా సమస్యలపై గళమెత్తిన సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డితోపాటు విలేకరులపై కూటమి సర్కారు కక్షపూరిత చర్యలకు పాల్పడటం ముమ్మాటికీ తప్పేనని పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కుతూ కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడటం సరైంది కాదన్నారు. ఏపీలో పత్రికాస్వేచ్ఛకు సంకెళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.