
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
ఎల్లారెడ్డిపేట/ముస్తాబాద్(సిరిసిల్ల): పంట పొలాల్లో పనులు చేసుకోవాల్సిన అన్నదాతలు యూరియా కోసం రోడ్డెక్కుతున్నారు. సొసైటీలు, గ్రోమోర్ కేంద్రాల వద్ద పొద్దంతా క్యూలైన్‌లో ఉంటే ఒక్క బస్తాకు మించి ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లతిమ్మాపూర్, రాచర్లగుండారం, బాకూర్‌పల్లితండా, పోచమ్మతండాలకు చెందిన రైతులు రాచర్లతిమ్మాపూర్ బస్టాండ్ దగ్గర సిరిసిల్ల–కామారెడ్డి ప్రధాన రహదారిపై గురువారం బైటాయించారు. రైతుల ఆందోళనకు బీఆర్‌ఎస్ నాయకులు అందె సుభాష్, మాజీ సర్పంచ్ భూక్య శంకర్‌నాయక్, గట్ల అనిల్, సీత్యానాయక్ సంఘీభావం తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను, నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
చెప్పుల వరుస
ముస్తాబాద్ మండలం పోతుగల్‌లోని యూరియా పంపిణీ కేంద్రం వద్ద రైతులు చెప్పులను వరస క్ర మంలో పెట్టారు. పోతుగల్ రైతులకు మాత్రమే 440 బస్తాలు వచ్చాయని గ్రామస్తులు తెలపగా.. ఇ తర గ్రామాల రైతులు తమకు కూడా ఇవ్వాలని కో రారు. దీంతో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు అ య్యాయి. సమాచారం అందుకున్న ఏవో దుర్గరాజు, ఎస్సై గణేశ్ అక్కడికి చేరుకుని రైతులను శాంతింపజేశారు. ఏవో హామీతో ముస్తాబాద్ రైతులు వెళ్లిపోయారు. మిగతా వారికి ఒక్కో బస్తాను అందజేశారు.

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు