మెటా నిందితుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

మెటా నిందితుల అరెస్టు

Sep 12 2025 6:49 AM | Updated on Sep 12 2025 6:49 AM

మెటా

మెటా నిందితుల అరెస్టు

పోలీసుల అదుపులో దాసరి రమేశ్‌, రాజు, ప్రకాశ్‌, శ్రీధర్‌

వాస్తవరూపం దాలుస్తున్న ‘సాక్షి’ కథనాలు

సీపీకే లీగల్‌ నోటీసులు, పోలీసులకు దమ్కీలు

ఉమ్మడి జిల్లా వాసులకు రూ.100కోట్లు టోకరా?

బాధితుల డబ్బులతో దుబాయ్‌లో బినామీ ఆస్తులు

ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తున్న బాధితులు

సాక్షిప్రతినిధి,కరీంనగర్‌:

క్రిప్టో కరెన్సీ పేరిట పాత జిల్లావాసులకు రూ.100 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన మెటా ఫండ్‌ యాప్‌ కథ కొలిక్కి వచ్చింది. రోజుకు రూ.లక్షలు సంపాదించవచ్చని ఆశచూపి రూ.కోట్లు వసూలు చేసిన సూత్రధారుల్లో నలుగురుని కరీంనగర్‌ సీసీఎస్‌ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. జూలైలో కశ్మీర్‌గడ్డకు చెందిన పుప్పాల శ్రీకర్‌ తనను మెటా ఫండ్‌ పేరిట రూ.54 లక్షల మేర మోసం చేశారని దాసరి రమేశ్‌, దాసరి రాజులపై ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న దాసరి రమేశ్‌, దాసరి రాజులతోపాటు బూర శ్రీధర్‌, తులసీ ప్రకాశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరితోపాటు లోకేశ్‌, సతీశ్‌ను అరెస్టు చేయాల్సి ఉంది. లోకేశ్‌ థాయ్‌లాండ్‌లో తలదాచుకుంటుండగా, సతీశ్‌ దుబాయ్‌ వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ కేసులో జాతీయ నిఘా సంస్థలు, రాష్ట్ర నిఘా సంస్థలు నిందితుల పాత్రపై ఎప్పుడో పూర్తిగా సమాచారం సేకరించాయి. ఈ విషయంలో జూన్‌ నుంచి ‘సాక్షి’ రాస్తున్న కథనాలు వాస్తవరూపం దాలుస్తుండటం గమనార్హం.

దుబాయ్‌లో ఆస్తులు

మెటా ఫండ్‌ నిర్వాహకులు ఎంతమంది అన్నది ఇప్పటికీ స్పష్టత లేదు. నిందితులు ఇక్కడ వసూలు చేసిన డబ్బును హవాలా మార్గంలో విదేశాలకు పంపారు. దుబాయ్‌లో దాదాపు రూ.40 కోట్లు ఖర్చు చేసి వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌, షేక్‌ జాహిద్‌ రోడ్‌లో ఈ ఏడాది జనవరిలో పబ్‌ ప్రారంభించారు. వీరి బినామీల పేర్లతో అక్కడ పలు వ్యాపారాలు కూడా మొదలు పెట్టారని, లక్కీ భాస్కర్‌ సినిమాలో మాదిరిగా పరిస్థితులు అనుకూలించకపోతే ఉన్నపలంగా వీసా తీసుకుని దేశం వదిలి పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. వీరు ఏడాదిన్నరగా పలువురి వద్ద నుంచి రూ.కోట్లు వసూలు చేశారు. వీరిలో సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, పెద్దపల్లి జిల్లాలకు చెందిన టీచర్లు, లెక్చరర్లు, పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు. వీరు ఇంతకాలం మౌనంగా ఉన్నా.. ఇప్పుడిప్పుడే ముందుకొస్తున్నారు.

మెటా నిందితుల అరెస్టు1
1/1

మెటా నిందితుల అరెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement