
బద్దం ఎల్లారెడ్డి పోరాటం స్ఫూర్తిదాయకం
ఇల్లంతకుంట(మానకొండూర్): బద్దం ఎల్లారెడ్డి పోరాటం స్ఫూర్తిదాయకమని, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి నిరంతరం పోరాడారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కొనియాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా గాలిపల్లి లోని బద్దం ఎల్లారెడ్డి స్తూపం వద్ద గురువారం పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వాలు సాయుధ పోరాట విలీన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. మంద సుదర్శన్, మంద అనిల్‌కుమార్, గుంటి వేణు, మీసం లక్ష్మణ్, తీపిరెడ్డి తిరుపతిరెడ్డి, మల్లేశం, భూమిరెడ్డి, బండారి చందు ఉన్నారు.