గదులను వినియోగంలోకి తేవాలి | - | Sakshi
Sakshi News home page

గదులను వినియోగంలోకి తేవాలి

Sep 12 2025 6:49 AM | Updated on Sep 12 2025 6:49 AM

గదులన

గదులను వినియోగంలోకి తేవాలి

గదులను వినియోగంలోకి తేవాలి ● సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు ‘టెక్స్‌టైల్‌ అధికారులపై విచారణ చేపట్టాలి’ నాణ్యమైన ఆహారం అందించాలి దంచికొట్టిన వాన

● సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని నారా యణపూర్‌ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల పనులు వేగంగా పూర్తి చేసి, వెంటనే వినియోగంలోకి తేవాలని సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఇటీవల కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా గ్రామంలో పర్యటించిన సమయంలో పాఠశాలను పరిశీలించారు. తరగతి గదులు అసంపూర్తిగా ఉండడంపై ఆరా తీసి వెంటనే కావాల్సిన సామగ్రిని సమాకూర్చారు. ఆర్డీవో వెంకటేశ్వర్లు గురువారం పరిశీలించారు. ఇటుకలు, సిమెంట్‌, ఇసుకను పాఠశాలకు తరలించామన్నారు. తహసీల్దార్‌ సుజాత, ఏఎంసీ చైర్మన్‌ సాబేరా బేగం, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, మాజీ ఉపసర్పంచ్‌ మహేందర్‌, హెచ్‌ఎం దేవరాజు ఉన్నారు.

సిరిసిల్లటౌన్‌: ప్రభుత్వ ఆర్డర్ల చీరల చెకింగ్‌ పేరుతో చేనేత, జౌళిశాఖ అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారని సీపీఐ పట్టణ కార్యదర్శి పంతం రవి ఆరోపించారు. సిరిసిల్లలోని కార్మిక భవనంలో గురువారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ఉత్పత్తి అయిన గుడ్డ నాణ్యత ప్రమాణాలు పరిశీలించేందుకు నియమించిన అధికారులు ఒక్కో మ్యాక్స్‌ సంఘానికి రూ.15వేల చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. డబ్బులు తీసుకొని నాణ్యతలేని గుడ్డను కూడా సెలెక్ట్‌ చేస్తున్నారన్నారు. కడారి రాములు, అజ్జ వేణు, ఎలిగేటి రాజు, సోమ నాగరాజు పాల్గొన్నారు.

బోయినపల్లి(చొప్పదండి): విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా ఫుడ్‌సేఫ్టీ అధికారి విజయలక్ష్మి సూచించారు. బోయినపల్లి కేజీబీవీలో ఏసీబీ తనిఖీల నేప థ్యంలో జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారి గురువారం జీసీడీవో పద్మజ, ఎంఈవో శ్రవణ్‌కుమార్‌తో కలిసి సందర్శించారు. విజయలక్ష్మి మాట్లాడుతూ కుక్‌ ఉదయం ఆరు గంటలకు హాజరుకావాలని ఆదేశించారు. కుళ్లిపోయిన కూరగాయలు ఉంచవద్దని సూచించారు. కాంప్లెక్స్‌ హెచ్‌ఎం భూమయ్య, ఇన్‌చార్జి ఎస్‌వో అనిత తదితరులు ఉన్నారు.

సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా బుధ, గురువారాల్లో వానలు దంచికొట్టాయి. కోనరావుపేట మండలంలో అత్యధికంగా 37.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రుద్రంగిలో 18.9 మిల్లీమీటర్లు, చందుర్తిలో 8.0, వేములవాడ రూరల్‌లో 9.4, వేములవాడలో 8.7, సిరిసిల్లలో 16.2, వీర్నపల్లిలో 17.0, ఎల్లారెడ్డిపేటలో 30.1, గంభీరావుపేటలో 10.6, ముస్తాబాద్‌లో 34.0, తంగళ్లపల్లిలో 17.5, ఇల్లంతకుంటలో 7.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బోయినపల్లి మండలంలో వర్షం పడలేదు.

ఉద్యోగ విరమణ బెనిఫిట్స్‌ ఇప్పించండి

ముస్తాబాద్‌(సిరిసిల్ల): సౌదీ అరేబియాలోని అభా పట్టణ సమీపంలోని అల్‌–హరాజ మున్సిపాలిటీలో పదేళ్లపాటు చేసిన పనికి వచ్చిన రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ ఇప్పించాలని ముస్తాబాద్‌ మండలం తెర్లుమద్దికి చెందిన రాగం రాజమల్లు కోరారు. ఈమేరకు హైదరాబాద్‌లోని ప్రవాసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాజమల్లు మాట్లాడుతూ 2014 నుంచి 2025 వరకు అల్‌–హరాజ మున్సిపల్‌లో క్లీనర్‌గా పనిచేశాడు. పదేళ్ల తర్వాత ఉద్యోగ విరమణ చేసి స్వదేశానికి తిరిగి వచ్చాడు. రాజమల్లు ఉద్యోగ విరమణ ప్రయోజనాలు రూ.5లక్షల(21,500 సౌదీ రియాళ్ల)ను అక్కడి రాజమల్లుకు చెందిన బ్యాంక్‌ ఖాతాలో జమచేసింది. ఈక్రమంలోనే గత ఫిబ్రవరి 12న స్వదేశానికి వచ్చాడు. సౌదీ నేషనల్‌ బ్యాంక్‌లో రాజమల్లు ఖాతాలో ఉన్న సొమ్మును ఇక్కడి బ్యాంక్‌లోని తన ఖాతాలో జమచేయాలని ప్రవాసీ ప్రజావాణిలో విన్నవించాడు. ఈమేరకు ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్‌చైర్మన్‌ మంద భీంరెడ్డి, గల్ఫ్‌ జేఏసీ నాయకుడు తోట ధర్మేందర్‌ ఈ విషయమై జెడ్డాలోని భారత దౌత్యకార్యాలయం దృష్టికి తీసుకెళ్లిన ట్లు తెలిపారు. రాజమల్లు పనిచేసిన కంపెనీ పీఆర్వో బిలాల్‌కు విషయం తెలిపామన్నారు.

గదులను వినియోగంలోకి తేవాలి
1
1/2

గదులను వినియోగంలోకి తేవాలి

గదులను వినియోగంలోకి తేవాలి
2
2/2

గదులను వినియోగంలోకి తేవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement