
ఒక్క బస్తాకోసం బారులు
కోనరావుపేటలో నిరీక్షిస్తున్న రైతులు
ఎల్లారెడ్డిపేటలో బారులు తీరిన అన్నదాతలు
ఎల్లారెడ్డిపేట/కోనరావుపేట: యూరియా కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. ఉదయం నుంచే సొసైటీలు, గ్రోమోర్ కేంద్రం వద్ద క్యూ కడుతున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గ్రోమోర్ కేంద్రానికి మంగళవారం 300 బస్తాల యూరియా రాగా, ఒక బస్తా చొప్పున ఇస్తామని నిర్వాహకులు ప్రకటించడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసు బందోబస్తు మధ్య కేవలం 150 బస్తాలు మాత్రమే రైతులకు అందించారు. 300 బస్తాలు వచ్చినా పూర్తిస్థాయిలో పంపిణీ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు అసహనం వ్యక్తం చేశారు. అలాగే కోనరావుపేటలోని గ్రోమోర్ సెంటర్ వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూ కట్టినా బస్తాలు రాకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఒక్క బస్తాకోసం బారులు