
ప్రజా కవి కాళోజీ సేవలు మరువలేనివి
సిరిసిల్ల/సిరిసిల్లక్రైం: ప్రజాకవి కాళోజీ నారాయణరావు సేవలు మరువలేనివని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవా రం కాళోజీ జయంతిని నిర్వహించారు. కాళోజీ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, జిల్లా ఉద్యానశాఖ అధికారి లత, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నజీర్ ఆహ్మద్, డీవైఎస్‌వో రాందాస్, ఎల్‌డీఎం మల్లికార్జునరావు, కలెక్టరేట ఏవో రాంరెడ్డి, డీపీఆర్వో వి.శ్రీధర్, డీటీసీపీ అధికారి అన్సర్, అధికారులు శ్రీకాంత్, రామచందర్, సిబ్బంది పాల్గొన్నారు.
మహనీయుడు కాళోజీ
తెలంగాణ భాష పరిరక్షణకు, ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపిన మహనీయుడు కాళోజీ అని ఎస్పీ మహేశ్ బీ గితే అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఏఎస్పీ చంద్రయ్య, ఆర్‌ఐలు మధుకర్, యాదగిరి, సీఐ మధుకర్, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజా కవి కాళోజీ సేవలు మరువలేనివి