
అర్హులను గుర్తించాలి
సిరిసిల్లటౌన్: ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇంటిస్థలంతోపాటు రూ.5లక్షలు మంజూరు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ కోరారు. స్థానిక పార్టీ ఆఫీస్‌లో సోమవారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. గత ప్రభుత్వం అర్హులుగా గుర్తించినా డబుల్ బెడ్‌రూమ్ అందని వారిని మొదటి ప్రాధాన్యతగా గుర్తించాలని కోరారు. ఈనెల 11న కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులు పాల్గొనాలని కోరారు. కోడం రమణ, ఎర్రవెల్లి నాగరాజు, సూరం పద్మ, నక్క దేవదాస్, ఎలిగేటి శీను, నాగుల సత్యనారాయణ పాల్గొన్నారు.